బాల్య వివాహాలపై అసోం ఉక్కుపాదం… 1,800 మంది అరెస్ట్

అస్సాం ప్రభుత్వం బాల్య వివాహాలపై ఉక్కుపాదం మోపుతున్నది. 18 ఏళ్లలోపు బాలికలను పెళ్లి చేసుకున్న 1800 మందికిపైగా వ్యక్తులను ఆ రాష్ట్ర పోలీసులు శుక్రవారం అరెస్ట్‌ చేశారు. అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ ఈ విషయం తెలిపారు. బాల్య వివాహ నిషేధ చట్టాన్ని ఉల్లంఘించిన వారిని రాష్ట్రవ్యాప్తంగా అరెస్ట్‌ చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు 1800 మందికిపైగా అరెస్ట్‌ అయినట్లు వెల్లడించారు. మహిళలపై క్షమించరాని, క్రూరమైన నేరాలకు పాల్పడిన వారిని, బాల్య వివాహాల కేసుల నిందితుల పట్ల ఎలాంటి సహనం వహించవద్దని పోలీసులను ఆదేశించినట్లు ట్వీట్‌ చేశారు. కాగా, 14 ఏళ్లలోపు బాలికలను వివాహం చేసుకున్న పురుషులపై పోక్సో చట్టం కింద, 14 నుంచి 18 ఏళ్లలోపు యువతులను వివాహం చేసుకున్న పురుషులపై బాల్య వివాహ నిషేధ చట్టం 2006 కింద కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని అస్సాం మంత్రివర్గం ఇటీవల నిర్ణయించింది.

 

మరోవైపు బాల్య వివాహాలకు వ్యతిరేకంగా అస్సాం ప్రభుత్వం చేస్తున్న యుద్ధం సెక్యులర్ అని సీఎం హిమంత బిస్వా శర్మ తెలిపారు. ఏ ఒక్క మతాన్ని లక్ష్యంగా చేసుకోవడం లేదన్నారు. బాల్య వివాహాలు చేసిన మత పెద్దలు, పూజారులపై కూడా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఇంతకాలం రహస్యంగా బాల్య వివాహాలు చేసుకున్న వారి మీద పోలీసులు దృష్టి సారించాడు. నేటి నుంచి బాల్య వివాహాల చేసుకున్న వారిని గుర్తించి వారిని అరెస్టు చెయ్యడానికి పోలీసులు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. వారం రోజుల్లో బాల్యవివాహాలు చేసుకున్న పురుషులు అందరిని అరెస్టు చెయ్యాలని పోలీసులు టార్గెట్ పెట్టుకున్నారని తెలిసింది.

Related Posts

Latest News Updates