సిరి క్రియేటివ్ వర్క్స్ పతాకంపై త్రిగుణ్, మేఘా ఆకాష్,మాయ, అజయ్ కతుర్వార్, శివ రామచంద్ర, తనికెళ్ళ భరణి, వైవా హర్ష నటీ నటులుగా నటిస్తున్న ఈ చిత్రంలో అలనాటి అందాల తార మధుబాల ప్రత్యేక పాత్రలో నటిస్తుంది.కొత్త దర్శకుడు శ్రీకాంత్ సిద్ధమ్ దర్శకత్వంలో యువ ప్యాషనేట్ శిరీష సిద్ధమ్ నిర్మిస్తున్న చిత్రం “ప్రేమదేశం”. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలోని పాటలకు, టీజర్ కు ప్రేక్షకులనుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.. ఇందులోని “పదములే లేవు పిల్ల” పాట కూడా అన్ని మాధ్యమాలలో టాప్ చార్ట్ బస్టర్ గా నిలిచింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని త్వరలో విడుదల చేయడానికి సిద్దమైంది. ఈ చిత్రానికి సంబందించిన సెకండ్ సింగిల్ “తెలవారెనే సా..మి … తెలవారెనేమో నా… సామి’ సాంగ్ ను సోమవారం సాయంత్రం విడుదల చేస్తున్నారు. ఈ సందర్బంగా చిత్ర యూనిట్ హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసింది. చిత్ర దర్శకుడు శ్రీకాంత్ సిద్ధమ్ మాట్లాడుతూ.. ఈ టైటిల్ తో వచ్చిన ప్రేమదేశం సినిమా నా చిన్నప్పుడు చూశాను.ఈ టైటిల్ తో సినిమా చేస్తుంటే ఆ ప్రెస్సర్ మోయగలడా అని అందరూ అనుకున్నారు.ఈ కథను టీం అందరూ బిలీవ్ చేయడంతో సస్సెస్ ఫుల్ గా పూర్తి చేయగలిగాను.డి ఓ. పి. సజాద్ కాక్కు అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. కిరణ్ గారు తన చక్కటి ఎడిటింగ్ తో సినిమాకు స్పీడ్ పెంచారు. ఇలాంటి మంచి సినిమా చేసే అవకాశం కల్పించిన నిర్మాతలకు ధన్యవాదాలు త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా అందరికీ కచ్చితంగా నచ్చుతుంది అన్నారు. చిత్ర హీరో త్రిగుణ్ మాట్లాడుతూ..షార్ట్ ఫిల్మ్ మేకర్స్ నుండి వచ్చిన శ్రీకాంత్ గారు నాకు అద్భుతమైన కథ ఇచ్చారు. న మదర్ సెంటిమెంట్ తో చేసిన సినిమాలు నాకు మంచి పేరు తెచ్చాయి. ఇందులో మధుబాల గారు నాకు మదర్ గా చేయడం చాలా హ్యాపీగా ఉంది.. నాకు జోడీ గా నటించిన మేఘా ఆకాష్ నా లక్కీ చార్మ్.ఇంతకుముందు తనతో చేసిన సినిమా మాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. నేను ఎర్లీ ఏజ్ లో హీరో అవ్వడం వల్ల కాలేజ్ డేస్ మిస్సయ్యాను. ఈ సినిమా నా కాలేజ్ డేస్ ను గుర్తు చేసింది. అలాగే అజయ్, శివ లు చాలా చక్కగా నటించారు. నిర్మాతలు ఈ సినిమా కొరకు కాంప్రమైజ్ కాకుండా చాలా చక్కగా నిర్మించారు. అక్టోబర్ లో విడుదల అవుతున్న ఈసినిమా గొప్ప విజయం సాదించాలి అన్నారు.
చిత్ర హీరోయిన్ మేఘా ఆకాష్ మాట్లాడుతూ..ఒకప్పటి బ్లాక్ బస్టర్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు.ఈ సినిమాకు మణిశర్మ గారు మ్యూజిక్ తో మ్యాజిక్ చేశారు. సజాద్ కాక్కు గారు చక్కటి విజువల్స్ తో మమ్మల్ని బాగా చూపించారు. త్వరలో వస్తున్న ఈ సినిమా విజయవంతం అవుతుందని ఆశిస్తున్నాను అన్నారు. నటుడు అజయ్ కతుర్వార్ మాట్లాడుతూ.. శ్రీకాంత్ గారు నాకు ఈ కథ చెప్పిడానికి వచ్చినపుడు మొదట టెన్షన్ పడ్డాను.ఎందుకంటే అలనాటి ప్రేమదేశం క్లాసిక్ మూవీ కి న్యాయం చేస్తానా అనిపించింది. తరువాత కథ విన్న తరువాత కాన్ఫిడెన్స్ వచ్చింది. సినిమా చాలా బాగా వచ్చింది. అప్పటి సినిమా లాగే ఈ సినిమా కూడా అందరినీ అలరిస్తుంది అన్నారు. నటుడు శివ రామచంద్ర మాట్లాడుతూ.. ఇందులో మంచి క్యారెక్టర్ ఇచ్చారు. త్వరలో వస్తున్న ఈ సినిమా అలనాటి ప్రేమదేశం అంత హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. నటి మాయ మాట్లాడుతూ..ఈ సినిమా షూటింగ్ తో హైదరాబాద్ పై చక్కటి ప్రేమ ఏర్పడింది.ఇలాంటి మంచి సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు. కో ప్రొడ్యూసర్ భరత్ మాట్లాడుతూ.. ఇది నామొదటి చిత్రం ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాము. ఈ సినిమా నుంచి విడుదలైన “పదములే లేవు పిల్ల” పాటకు ప్రేక్షకులకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు విడుదలైన ఈ పాట కూడా మాకు పేరు తెస్తుందని భావిస్తున్నాను అన్నారు.. అసోసియేట్ ప్రొడ్యూసర్ రఘు కళ్యాణ్ మాట్లాడుతూ..ఇది నామొదటి చిత్రం ఈ సినిమాలో అందరూ చాలా బాగా నటించారు. మంచి కాన్సెప్ట్ తో వస్తున్న ఈ చిత్రం గొప్ప విజయం సాదించాలి అన్నారు. కోరియోగ్రఫర్ ఈశ్వర్ పెంటి మాట్లాడుతూ..’పదములే పిల్ల’ సాంగ్ కు మంచి పేరు వచ్చింది. పాత ప్రేమదేశం మూవీ కి తీసిపోకుండా ఈ సినిమా ఉంటుంది అన్నారు. ఎడిటర్ కిరణ్ మాట్లాడుతూ.. ఇలాంటి మంచి సినిమాకు ఎడిటింగ్ చేసే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు. లిరిసిస్ట్ అలరాజు మాట్లాడుతూ.. అందరికే మణిశర్మ మ్యూజిక్ లో సాంగ్ రాయాలి అనుకుంటారు. అలాంటిది రేపు విడుదల అయ్యే పాట రాయడం చాలా హ్యాపీ గా ఉంది. నటీనటులు: త్రిగుణ్, మేఘా ఆకాష్, మధుబాల, తనికెళ్ల భరణి, మాయ, అజయ్ కతుర్వార్, శివ రామచంద్ర, వైవా హర్ష , వైష్ణవి చైతన్య,కమల్ నార్ల తేజ మరియు ఇతరులు. సాంకేతిక నిపుణులు ప్రొడక్షన్ హౌస్: సిరి క్రియేటివ్ నిర్మాత: శిరీష సిద్ధమ్ దర్శకుడు: శ్రీకాంత్ సిద్ధమ్ సంగీతం: మణిశర్మ డి ఓ. పి. : సజాద్ కాక్కు ఎడిటర్ : కిరణ్ తుంపెర ఆర్ట్ : రవి కుమార్ కోరియోగ్రఫీ : ఈశ్వర్ పెంటి స్టైలింగ్ : రూప స్టంట్స్ : రియల్ సతీష్ & డ్రాగన్ ప్రకాష్