భద్ర ప్రొడక్షన్స్ బ్యానర్ నుంచి రూపొందిన న్యూ ఏజ్ క్రైమ్ థ్రిల్లర్ ‘తగ్గేదే లే’. యువ కథనాాయకుడు నవీన్ చంద్ర లీడ్ రోల్‌లో నటిస్తోన్న ఈ చిత్రాన్ని ‘దండుపాళ్యం’ ఫేమ్ శ్రీనివాస్ రాజు తెరకెక్కిస్తుున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, ఇంట్రెస్టింగ్ టీజర్‌కు అమేజింగ్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు మేకర్స్ ఈ సినిమా నుంచి ‘తగ్గేదే లే’ అనే స్పెషల్ సాంగ్‌ను విడుదల చేశారు. ఈ పాటను మరో యంగ్ హీరో రాజ్ తరుణ్ విడుదల చేసి ఎంటైర్ టీమ్‌కు అభినందనలు తెలిపారు. ఈ మాసివ్ జానపద పాటలో మాస్ బీట్‌కి నైనా గంగూళీ ఆకట్టుకునే డాన్స్ చూసిన ప్రతి ఒక్కరినీ ఓ ట్రాన్స్‌లోకి తీసుకెళుతుంది. ప్రోమోలో అద్భుతమైన డాన్స్ మూమెంట్స్ కనిపిస్తుండగా, లిరికల్ వీడియోలో ఇంకా ఏదో కొత్త ఉంటుందనే ఓ అభిప్రాయాన్ని కలిగిస్తోంది. చరణ్ అర్జున్ సంగీతం అందించిన ఈ పాట విన్నవారందిరకీ నచ్చుతుంది. మాసివ్ బీట్‌కి నైనా గంగూళీ వేసిన డాన్స్ అందరిని మెప్పిస్తుంది. దీంతో పాట చూసిన వెంటనే అందరికీ కనెక్ట్ అయిపోతుంది. సంగీతం అందించటంతో పాటు చరణ్ అర్జున్ పాటను రాశారు కూడా. రానున్న రోజుల్లో తగ్గేదే లే సాంగ్‌ను అందరినీ కట్టిపడేస్తుందనేంతగా ఉంది. మోహన భోగరాజు, చరణ్ అర్జున్, శరత్ రవి మాసివ్ సాంగ్‌ను పాడారు. దివ్యా పిళ్లై, అనన్య సేన్ గుప్తా హీరోయిన్స్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో నాగబాబు, డానీ కుట్టప్ప, రవి కాలే, మకరంద్ దేశ్ పాండే, అయ్యప్ప పి.శర్మ, నవీన్ చంద్ర, పూజా గాంధీ, రాజా రవీంద్ర, రవి శంకర్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. వెంకట్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందిస్తోన్న ఈ చిత్రానికి చరణ్ అర్జున్ సంగీతాన్ని అందిస్తుండగా గ్యారీ బి.హెచ్ ఎడిటింగ్ చేస్తున్నారు. త్వరలోనే సినిమాను విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.