రాజేంద్ర నగర్ లోని నేషనల్ పోలీస్ అకాడమీ (NPA) లో కంప్యూటర్ల చోరీ జరిగింది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత వుండే అక్కడ.. 7 కంప్యూటర్లు మాయమయ్యాయి. అయితే.. ఈ విషయాన్ని అక్కడి పోలీసు అధికారులు గమనించారు. ఎవరో తెలిసిన వ్యక్తులే ఈ పని చేసుంటారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో సీసీటీవీ కెమెరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. దీంతో చోరీ దృశ్యాలు రికార్డు అయ్యాయి. కంప్యూటర్లను ఎత్తుకెళ్లిన వ్యక్తి అకాడమీ ఐటీ సెక్షన్ లో పనిచేస్తున్న చంద్రశేఖర్ గా గుర్తించారు. దీంతో పోలీస్ అకాడమీ అధికారులు రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.