స్టార్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న “ఫ్యామిలీ స్టార్” సినిమా ట్రైలర్ రిలీజ్ కు టైమ్ ఫిక్స్ చేశారు. ఈ నెల 28న హైదరాబాద్, తిరుపతి నగరాల్లో ప్రేక్షకుల కేరింతల మధ్య గ్రాండ్ గా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేయబోతున్నారు. హైదరాబాద్ మూసాపేట్ లోని శ్రీరాములు థియేటర్ లో ఉదయం 11 గంటలకు, తిరుపతి పి.జి.ఆర్ సినిమాస్ థియేటర్ లో సాయంత్రం 6 గంటలకు “ఫ్యామిలీ స్టార్” ట్రైలర్ రిలీజ్ చేసి ఆడియెన్స్ సమక్షంలో స్క్రీనింగ్ చేయబోతున్నారు. ఇవాళ “ఫ్యామిలీ స్టార్” ట్రైలర్ అనౌన్స్ మెంట్ పోస్టర్ విడుదల చేశారు. ఆల్ట్రా స్టైలిష్ లుక్ లో లగ్జరీ కారు పక్కన విజయ్ దేవరకొండ నడిచి వస్తున్న స్టిల్ తో డిజైన్ చేసిన ఈ పోస్టర్ ఆకట్టుకుంటోంది. ఇప్పటిదాకా ఫ్యామిలీ స్టార్ నుంచి రివీల్ చేసిన మిగతా పోస్టర్స్ కు పూర్తి భిన్నంగా ఉందీ పోస్టర్. “ఫ్యామిలీ స్టార్” ట్రైలర్ పై వీడీ ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ క్రియేట్ అవుతోంది.
“ఫ్యామిలీ స్టార్” సినిమాను ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను హోల్ సమ్ ఎంటర్ టైనర్ గా డైరెక్టర్ పరశురామ్ పెట్ల రూపొందిస్తున్నారు. “ఫ్యామిలీ స్టార్” సినిమాకు క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వాసు వర్మ వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాను ఏప్రిల్ 5వ తేదీన గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకురాబోతున్నారు.
నటీనటులు: విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ తదితరులు
టెక్నికల్ టీమ్
సినిమాటోగ్రఫీ : కేయూ మోహనన్
సంగీతం : గోపీసుందర్
ఆర్ట్ డైరెక్టర్ : ఏ ఎస్ ప్రకాష్
ఎడిటర్ : మార్తాండ్ కె వెంకటేష్
పీ ఆర్ ఓ : జి.యస్.కే మీడియా, వంశీ కాక
క్రియేటివ్ ప్రొడ్యూసర్ : వాసు వర్మ
నిర్మాతలు : రాజు – శిరీష్
రచన, దర్శకత్వం – పరశురామ్ పెట్ల