తొలి సినిమా ‘హీరో’తో ఆకట్టుకున్న యంగ్ హీరో అశోక్ గల్లా తన సెకెండ్ మూవీ ‘దేవకీ నందన వాసుదేవ’తో వస్తున్నారు. గుణ 369 అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో, లలితాంబిక ప్రొడక్షన్స్ పతాకంపై సోమినేని బాలకృష్ణ నిర్మించారు. నల్లపనేని యామిని సమర్పిస్తున్నారు.
ఈ రోజు, రానా దగ్గుబాటి, సందీప్ కిషన్ కలిసి ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్‌ను లాంచ్ చేసి అశోక్ గల్లా, టీంకి శుభాకాంక్షలు తెలిపారు. సుదర్శన చక్రాన్ని కలిగి ఉన్న భూమిపై ఉన్న ఏకైక వాసుదేవ విగ్రహం గురించి వివరిస్తూ పవర్ ఫుల్ వాయిస్ ఓవర్‌తో ట్రైలర్ ప్రారంభమవుతుంది. అశోక్ గల్లా తన యాక్షన్-ప్యాక్డ్ పాత్రలో ఇంటెన్స్ ఫైట్ సీన్ తో పరిచయం అయ్యారు. ఈ సంవత్సరం అతని జాతకంలో ప్రమాదం ఉన్నందున జాగ్రత్తగా ఉండాలని అతని తల్లి హెచ్చరిస్తుంది. అశోక్, మానస మధ్య వచ్చే సన్నివేశాలు కథకు రొమాన్స్ టచ్ యాడ్ చేశాయి.
మరొక వైపు తన సొంత మేనల్లుడు, తన సోదరి మూడవ కొడుకు నుండి ప్రాణహాని ఎదుర్కునే విలన్ రివిల్ అవుతాడు. మిగిలిన కథనం మంచి, చెడుల మధ్య యుద్ధంగా ఎపిక్ క్లాస్ ని సెట్ చేసింది. శ్రీ కృష్ణ భగవానుడి శక్తివంతమైన దర్శనాన్ని అందించే ఆధ్యాత్మిక టచ్‌తో ట్రైలర్ ముగుస్తుంది. ప్రశాంత్ వర్మ అందించిన గ్రిప్పింగ్ స్టోరీని కమర్షియల్ ఫార్మెట్‌లో ప్రజెంట్ చేశారు అర్జున్ జంధ్యాల. సాయిమాధవ్ బుర్రా రాసిన పవర్ ఫుల్ డైలాగ్స్ మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకునేలా ఉన్నాయి. అశోక్ గల్లా తన పాత్రలో చూపించిన ట్రాన్స్ ఫర్మెషన్ , అతని కమాండింగ్ స్క్రీన్ ప్రెజెన్స్ ప్రత్యేకంగా నిలిచింది. వారణాసి మానస, అశోక్ లవ్ ఇంట్రస్ట్ గా బ్యూటీఫుల్ గా కనిపించారు. దేవదత్తా గజానన్ నాగే మెయిన్ విలన్ గా అద్భుతమైన నటనను ప్రదర్శించారు.
విజువల్స్ అత్యుత్తమంగా ఉన్నాయి, సినిమాటోగ్రాఫర్లు ప్రసాద్ మూరెళ్ల ,రసూల్ ఎల్లోర్ బ్రిలియంట్ వర్క్ అందించారు. భీమ్స్ సిసిరోలియో ఎలక్ట్రిఫైయింగ్ స్కోర్ కథని మరింత ఎలివేట్ చేసింది. లలితాంబిక ప్రొడక్షన్స్ నిర్మాణ విలువలు ఉన్నతంగా వున్నాయి. తమ్మిరాజు ఎడిటర్.ఈ ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలు నెలకొల్పింది, దేవకి నందన వాసుదేవ నవంబర్ 22 న థియేటర్లలోకి రానుంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ హక్కులను శంకర్ పిక్చర్స్ సొంతం చేసుకుంది.
ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గల్లా జయదేవ్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. రానాకి థాంక్యూ. తను బిగినింగ్ నుంచి ఎంతో సపోర్ట్ గా ఉంటున్నారు. ప్రశాంత్ గారు ఫస్ట్ టైం వచ్చి ఈ కథ చెప్పినప్పుడు అశోక్ కి చాలా నచ్చింది. అప్పుడే ఫస్ట్ టైం నేను ప్రశాంత్ వర్మ గారిని పేరు విన్నాను. తర్వాత ఆయన కెరీర్ చూస్తున్నప్పుడు, హనుమాన్ లాంటి ఒక పెద్ద సక్సెస్ వచ్చినప్పుడు చాలా ఆనందంగా అనిపించింది. ఈ సినిమాకి ప్రశాంత్ వర్మ గారు అందించిన కథ చాలా ప్రత్యేకంగా నిలుస్తుంది. అంతా మంచి అవకాశం ఇచ్చిన ప్రశాంత్ వర్మ గారికి థాంక్యూ సో మచ్. డైరెక్టర్ అర్జున్, ప్రొడ్యూసర్ బాలకృష్ణ గారితో చాలా ప్యాషన్ తో ఈ సినిమా రూపొందించారు. వాళ్ళు ఎంత హార్డ్ వర్క్ చేశారో నేను చూశాను. ఒక ఛాలెంజ్ గా తీసుకొని ఈ సినిమా చేశారు. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. సినిమా కోసం ఆసక్తి ఎదురు చూస్తున్నాం. అశోక్ సెకండ్ సినిమా ఇది. ఫస్ట్ సినిమా కోవిడ్ సమయంలో రావడం కొంచెం ప్రాబ్లం అయింది.ఆ సినిమాకి కూడా చాలా మంచి ప్రశంసలు వచ్చాయి. తన పెర్ఫార్మన్స్ ని అందరూ మెచ్చుకున్నారు. ఫాదర్ గా నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఈ సినిమాతో తను నెక్స్ట్ లెవెల్ కి వెళ్తారని ఆశిస్తున్నాను. అశోక్, మానస టీమ్ అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్. ఈ సినిమా టీమ్ అందర్నీ కొత్త హైట్స్ కి తీసుకెళ్తుందని భావిస్తున్నాను. అందరికీ గుడ్ లక్. థాంక్యూ వెరీ మచ్’ అన్నారు.
హీరో రానా మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. సాయి మాధవ్ గారు నాకు రుణపడి ఉన్నాను అని చెప్పారు. కానీ నేనే ఆయనకి రుణపడి ఉన్నాను. నాకు కృష్ణం వందే జగద్గురుంతో ‘కృష్ణతత్వం’ అంటే ఏంటో నేర్పించింది ఆయనే. ఆయనని ఎప్పుడు కలిసిన ‘దేవుడంటే సాయం’ అనే ఒక లైన్ గుర్తు ఉంటుంది. ఆ ఒక్క పదం నా జీవితాన్ని మార్చేసింది. ఆ రోజు నుంచి నాకు వీలైన ఏ సహాయం చేయాలనుకున్న చేస్తాను. అంత మంచి తత్వాన్ని నేర్పించిన సాయి మాధవ్ గారికి థాంక్యూ సో మచ్. ప్రశాంత్ వర్మ అమేజింగ్ రైటర్ అండ్ డైరెక్టర్. మోడ్రన్ జనరేషన్ కి మైథాలజీ స్టోరీలు చెప్పడంలో మాస్టర్. ఈ కథని ఆయన రాయడం చాలా ఆనందంగా ఉంది. ఇది కృష్ణుడు, కంసుడు నుంచి స్ఫూర్తి పొంది రాసిన సోషల్ సినిమా అని తెలుస్తుంది. ఈ సినిమా డైరెక్టర్ అర్జున్ ప్రొడ్యూసర్ బాలకృష్ణ.. ఒకరు అర్జునుడు మరొకడు కృష్ణుడు. ఈ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా డెఫినెట్ గా ఒక స్పెషల్ మూవీ అవుతుంది. మానస మన తెలుగు అమ్మాయి.తెలుగులో మాట్లాడే అమ్మాయిని హీరోయిన్ గా చూడటం చాలా ఆనందంగా ఉంది. ఈ వేడుకకి రావడానికి కారణం అశోక్. మహేష్ గారి డిసిప్లిన్ అండ్ సిన్సీయారిటీ, అశోక్ నాన్నగారైన జయదేవ్ గారి విజన్, ఎక్స్పోజర్.. ఈ రెండుంటే జీవితం అద్భుతంగా ఉంటుంది. అశోక్ కి ఆల్ ద వెరీ బెస్ట్. హీరో సినిమాలో తనను చూశాను. ఇప్పుడు ఈ ట్రైలర్ చూశాను. తనలో చాలా గ్రోత్ కనిపించింది. 22 నవంబర్ ఈ సినిమా థియేటర్స్లోకి వస్తుంది. సినిమాని ఎంజాయ్ చేయండి. టీం అందరికీ ఆల్ ది బెస్ట్’ అన్నారు.
హీరో సందీప్ కిషన్ మాట్లాడుతూ.. ప్రశాంత్ వర్మ గురించి అందరూ ఇంత గొప్పగా మాట్లాడుతుంటే చాలా గర్వంగా ఉంది. ప్రశాంత్ వర్మ దగ్గర ఉన్న కథల్లో ఇది నాకు మోస్ట్ ఎక్సైటింగ్ స్క్రి.ప్ట్ ఈ స్క్రిప్ట్ ని అశోక్ చేయడం చాలా ఆనందంగా ఉంది. తన ఫస్ట్ సినిమా చూశాను. ఈ సినిమా ట్రైలర్ చూశాను. చాలా జెన్యూన్ గా కష్టపడుతున్నారు. ఇందులో హీరో, హీరోయిన్ క్యారెక్టర్స్ యూనిక్ గా వున్న్తాయి. బిగ్ స్క్రీన్స్ పై ఈ సినిమాను చూడటానికి చాలా ఉత్సాహంగా ఉన్నాను. అర్జున్ గారి ఫస్ట్ సినిమా నాకు చాలా ఇష్టం. ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నాను. జయదేవ్ గారు అంటే మాకు ఒక స్ఫూర్తి. ఆయన్ని నేరుగా కలవడం చాలా ఆనందంగా ఉంది. బాలకృష్ణ గారి లాంటి మంచి ప్రొడ్యూసర్లకి థియేటర్లో మంచి డబ్బులు రావాలని కోరుకుంటున్నాను. మానస తెలుగు అమ్మాయి, మిస్ వరల్డ్. ఇందులో తన క్యారెక్టర్ చాలా బాగుంటుంది. ఈ వేడుక నేను రావడానికి కారణం శంకర్ గారు. నేను సత్యాని పెట్టుకుని వివాహ భోజనంబు అని ఒక సినిమా తీద్దాం అనుకున్నప్పుడు అందరూ వద్దన్నారు. కానీ ఆ సినిమా రెండు రాష్ట్రాల రైట్స్ ని శంకర్ గారు కొనుక్కున్నారు. తను ఒక ఐడియా ని, కథని నమ్మి సినిమా చేసే డిస్ట్రిబ్యూటర్ అలాంటి డిస్ట్రిబ్యూటర్ ఇండస్ట్రీకి అవసరం. చాలామందికి పెద్దదిక్కు రానా. తను ప్రతి సినిమాకు వచ్చి సపోర్ట్ చేస్తారు. టీం అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్. ఈ సినిమా మంచి విజయాన్ని అందిస్తుందని కోరుకుంటున్నాను’ అన్నారు.
హీరో అశోక్ గల్లా మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. రానా గారు నాకు ఎప్పుడు సపోర్ట్ చేస్తారు. సందీప్ కిషన్ అన్న థాంక్యూ సో మచ్. ఇక్కడి వరకు రావడానికి కారణం ప్రశాంత్ వర్మ గారు. ఈ క్రెడిట్ అంతా ప్రశాంత్ గారికి వెళుతుంది. ఇంత అద్భుతమైన కథ అందించిన ప్రశాంత్ వర్మ గారికి థాంక్యూ సో మచ్. అర్జున్ గారు తన విజన్ తో సినిమాని మరో రెండు మెట్లు పైకి తీసుకెళ్లారు. నాకు ఈ సినిమా ఇచ్చిన నిర్మాత బాలకృష్ణ గారికి థాంక్యూ సో మచ్. ట్రైలర్ కు వచ్చిన రెస్పాన్స్ నాకు చాలా ఆనందంగా అనిపించింది. నవంబర్ 22న థియేటర్స్ లో కలుద్దాం’ అన్నారు
హీరోయిన్ మానస వారణాసి మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఇది ఒక కమర్షియల్ డివైన్ థ్రిల్లర్. ఈ సినిమాలో నాకు అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. అశోక్ గారు చాలా అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు. ఆయనతో వర్క్ చేయడం చాలా ఆనందాన్నిచ్చింది. ఇందులో ఫైట్ సీక్వెన్స్, డాన్స్ సీక్వెన్స్, సాంగ్స్ కోసం చాలా ఎక్సిక్యూటివ్ గా ఎదురు చూస్తున్నాను. నన్ను ఎంతగానో గైడ్ చేసిన డైరెక్టర్ అర్జున్ గారికి థాంక్యూ సో మచ్. ఈ సినిమాల్లో పని చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఇంత మంచి క్రియేటివిటీతో పనిచేయడం నాకు చాలా ఆనందం ఇచ్చింది. నవంబర్ 22న థియేటర్స్ లో కలుద్దాం’ అన్నారు
నిర్మాత బాలకృష్ణ మాట్లాడుతూ.. ఈ ట్రైలర్ లాంచ్ కి వచ్చి మాకు సపోర్ట్ చేసిన గెస్ట్ లందరికీ థాంక్యూ సో మచ్. నేను సినిమా తీయాలి వచ్చినప్పుడు కొంతమంది హీరో దగ్గరికి వెళ్ళాను. కానీ ఎవరు నన్ను నమ్మలేదు. ఇలాంటి సమయంలో ప్రశాంత్ గారు వర్మ గారు నన్ను నమ్మి ఈ స్థాయికి తీసుకొచ్చారు. తను లేకపోతే నాకు ఈ ప్రాజెక్టు లేదు. మా డైరెక్టర్ గారు, మా హీరో గారు నాకు ఇచ్చిన సపోర్ట్ ని మర్చిపోలేను. కథను నమ్మి ఎక్కడ రాజీ పడకుండా భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించాము. ఈ సినిమా చూసినప్పుడు మీకు అఖండ సినిమా గుర్తొస్తుంది. ఆ బ్యాగ్రౌండ్ స్కోరు బీమ్స్ ఆ లెవెల్ లో కొట్టారు. అశోక్ గారు, మానస అందరూ చాలా అద్భుతంగా పెర్ఫాం చేశారు. ఈ సినిమా మా అందరికీ మంచి లైఫ్ ఇస్తుందని నమ్ముతున్నాను. ఈ సినిమా మీ అందరి అంచనాల్ని అందుకుంటుంది’ అన్నారు.
డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. ప్రతి కథ మీద హీరో పేరు రాసి ఉంటుంది. ఈ కథపై అశోక్ పేరు రాసి ఉంది. సినిమా చూసినప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. మేమేదైతే అనుకున్నామో అర్జున్ గారు ఇంకా బాగా డెవలప్ చేసి చాలా అద్భుతంగా చూపించారు, నిర్మాత బాల గారు చాలా మంచి సినిమా చేయాలని చాలా వెయిట్ చేసి ఈ సినిమాని చాలా అద్భుతంగా నిర్మించారు. సినిమా చూశాను చాలా అద్భుతంగా ఉంది. అశోక్, మానస అందరూ చాలా బాగా పెర్ఫార్మ్ చేశారు. నాకు చాలా నచ్చింది. రీ రికార్డింగ్ చాలా బాగా చేశారు. మంచి ఫ్యామిలీ ఫిలం. లవ్ స్టోరీ, యాక్షన్, ఎమోషన్స్ అన్ని ఉన్నాయి. ట్రైలర్లో ఏదైతే ఎనర్జీ చూసారో సినిమా లో ఆ ఎనర్జీ ఉంటుంది. అశోక్ ఈ సినిమాతో మరో మెట్టు పైకెక్కాలని కోరుకుంటున్నాను. అర్జున్ గారు ఈ సినిమాతో నెక్స్ట్ లెవెల్ కి వెళ్లాలని, పెద్ద యాక్టర్స్ తో పనిచేయాలని కోరుకుంటున్నాను. యంగ్ టీం ని ఎంకరేజ్ చేయండి. అందరూ కష్టపడి పని చేశారు. ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. థాంక్యూ సో మచ్’ అన్నారు.
డైరెక్టర్ అర్జున్ జంధ్యాల మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. . ఈ వేడుక విచ్చేసిన రానా గారికి, సందీప్ కిషన్ గారికి, మాకు బిగినింగ్ నుంచి ఎంతో సపోర్టుగా నిలిచిన జయదేవ్ గారికి, నన్ను ఎంతగానో ఎంకరేజ్ చేసినా ప్రశాంత్ గారికి కృతజ్ఞతలు. సాయి మధు బుర్ర గారు చాలా అద్భుతమైన మాటలు రాశారు .బీమ్స్ గారు అద్భుతమైన బిజిఎం చేశారు. సినిమా గురించి ట్రైలర్ మాట్లాడుతుంది. ఇక్కడకు వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను’ అన్నారు.
డిస్ట్రిబ్యూటర్ శంకర్ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. ఈ సినిమా ఓపెనింగ్ నుంచి నేను ట్రావెల్ అవుతున్నాను. సినిమా చూసిన తర్వాత ఇంటర్వెల్ అయిపోగానే నాకు అఖండ సినిమా గుర్తొచ్చింది. అర్జున్, బోయపాటి గారి శిష్యుడ. సెకండ్ హాఫ్ అయిపోగానే నాకు ఒక బోయపాటి గారి సినిమా కనిపించింది. అంత అద్భుతంగా వుంది. ఇంత మంచి సినిమా నాకు ఇచ్చిన ప్రొడ్యూసర్ బాలా గారికి, ప్రశాంత్ వర్మ గారికి, మా హీరో అశోక్ గారికి స్పెషల్ థాంక్స్. అశోక్ గారు ఈ సినిమాలో ఒక మాస్ యాంగిల్ లో కనిపిస్తారు. ఈ సినిమా డెఫినెట్ మంచి హిట్ అవుతుంది. దీనికి ప్రేక్షకులు, మీడియా మిత్రులు సహకారం కావాలని కోరుతున్నాను’ అన్నారు
డైలాగ్ రైటర్ సాయి మాధవ్ బుర్ర మాట్లాడుతూ.. అందరికి నమస్కారం.ఈ ట్రైలర్ ని రానా బాబు లాంచ్ చేయడం నాకు పర్సనల్ గా ఎంతో ఆనందాన్ని కలిగించిన విషయం. రానా బాబు చేసిన కృష్ణం వందే జగద్గురుం సినిమా లేకపోతే రైటర్ గా నేను ఈరోజు ఇక్కడ నిలబడే వాడిని కాదు. నువ్వు ఎంతగానో ప్రోత్సహించిన రానా గారు కృష్ణ గారికి నేను జీవితాంతం రుణపడి ఉంటాను. దేవకీ నందన వాసుదేవ చాలా మంచి సినిమా ఈ సినిమాతో ఇండస్ట్రీకి ఒక స్టార్ ప్రొడ్యూసర్ వస్తున్నారు ఆయనే బాలకృష్ణ చాలా ఫ్యాషన్ తో ఈ సినిమా తీశారు. అర్జున్ కథ చెప్పినప్పుడే ఈ సినిమా నాకు కనిపించింది. చాలా అద్భుతమైన కథ. ఇందులో ఎమోషన్ ఎలివేషన్ డివోషన్ అన్ని ఉన్నాయి. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. ఈ సినిమాతో అర్జున్ స్టార్ట్ డైరెక్టర్ అవుతాడు. ఈ సినిమాతో అశోక్ నెక్స్ట్ లెవెల్ స్టార్ హీరో అవుతాడు. ముగ్గురు స్టార్స్ సినిమా తీసుకొస్తుంది. అలాగే హీరోయిన్ గా చేసిన అమ్మాయి కూడా స్టార్ అవుతుంది. మా ఎంపీ గారు గల్లా జయదేవ్ గారితో ఈ వేదికని షేర్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. చాలా మంచి సినిమా ఇది. అందరికీ నచ్చుతుంది. కచ్చితంగా హిట్ అవుతుంది’ అన్నారు
తారాగణం: అశోక్ గల్లా, వారణాసి మానస, దేవదత్త గజానన్ నాగే, ఝాన్సీ
సాంకేతిక సిబ్బంది:
కథ: ప్రశాంత్ వర్మ
దర్శకత్వం: అర్జున్ జంధ్యాల
నిర్మాత: సోమినేని బాలకృష్ణ
బ్యానర్: లలితాంబిక ప్రొడక్షన్స్
సమర్పణ: నల్లపనేని యామిని
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
DOP: ప్రసాద్ మూరెళ్ల, రసూల్ ఎల్లోర్
ఎడిటర్: తమ్మిరాజు
డైలాగ్స్: బుర్రా సాయి మాధవ్
పబ్లిసిటీ డిజైనర్: ధని ఏలే
పీఆర్వో: వంశీ-శేఖర్