జో బైడెన్ వ్యాఖ్యల పై … స్పందించిన పాక్ ప్రధాని

ప్రపంచంలో అత్యంత ప్రధాకర దేశాల్లో పాకిస్తాన్ ఒకటని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఖండించారు. బైడెన్ వ్యాఖ్యలు అసత్యమని, తప్పుదోవ పట్టించేలా ఉన్నాయన్నారు. గత దశాబ్దాలుగా పాకిస్థాన్ అత్యంత బాధ్యతాయుతమైన అణు రాజ్యంగా నిరూపించబడిందన్నారు. మా అణు కార్యక్రమం సాంకేతికంగా, ఫూల్ప్రూఫ్ కమాండ్, కంట్రోల్ సిస్టమ్ ద్వారా నిర్వహించబడుతుంది అని పాక్ ప్రధాని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

పాకిస్థాన్ అమెరికాల మధ్య మంచి స్నేహం ఉందని దాన్ని చెడగొట్టే వ్యాఖ్యలు చేయొద్దన్నారు. శాంతి, భద్రతలను పెంపొందించడానికి యుఎస్తో సహకరించాలనేది మా కోరిక అని షరీప్ అన్నారు. పాక్ బాధ్యతాయుతమైన అణు దేశం. అంతర్జాతీయ అణు శక్తి సంస్థ అవసరాలకు అనుగుణంగా మా అణు ఆస్తులకు అత్యుత్తమ రక్షణలు ఉన్నందుకు మేం గర్విస్తున్నామన్నారు.

Related Posts

Latest News Updates