రఫేల్ 36 వ యుద్థ విమానం కూడా మన భారత్ కు వచ్చేసింది. దీంతో ఫ్రాన్స్ తో రఫేల్ డీల్ ముగిసినట్లైంది. ఫ్రాన్స్ కు చెందిన దసో కంపెనీతో చేసుకున్న ఒప్పందంలో భాగంగా చివరి యుద్ధ విమానం భారత్ కు వచ్చేసింది. ఈ మేరకు వాయుసేన ట్వీట్ చేసింది. ప్యాక్ పూర్తైంది అంటూ ట్విట్టర్ లో పేర్కొంది. భారత రక్షణ రంగాన్ని మరింత పరిపుష్టం చేయడానికి 59 వేల కోట్ల వ్యయంతో 36 అత్యాధునిక రఫేల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేసేందుకు భారత్, ఫ్రాన్స్ మధ్య 2016 లో ఒప్పందం జరిగింది. విడతల వారీగా ఇప్పటి వరకూ 35 యుద్ధ విమానాలు చేరుకున్నారు. తాజాగా… గురువారం నాటికి చివరిది చేరుకుంది.












