గబ్బిలాల్లో మరో వైరస్‌ను శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆ వైరస్ కరోనా కన్నా డేంజర్ అని వెల్లడిరచారు. రష్యాలో వెలుగులోకి వచ్చిన ఈ వైరస్‌కు ఖోస్టా`2 అని పేరు పెట్టారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న కరోనా వ్యాక్సిన్లు ఈ వైరస్‌పై పని చేయకపోవచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు. గబ్బిలాల్లో వెలుగుచూసిన ఈ వైరస్ జంతువుల ద్వారా మనుషులకే సోకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు. ఇలాంటి వైరస్ తొలుత 2020లోనే గుర్తించామని (ఖోస్టా`1), మళ్లీ ఇప్పుడు వెలుగులోకి రావడం కొంత ఆందోళన కలిగించే అంశమేనని వాషింగ్టన్ స్టేట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.