“క” సినిమా ప్రేక్షకుల మనసుల్లో ఎప్పటికీ నిలిచిపోతుంది – హీరోయిన్స్ నయన్ సారిక, తన్వీ రామ్
యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న భారీ పీరియాడిక్ థ్రిల్లర్ సినిమా “క”. ఈ సినిమాలో నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్ టైన్ మెంట్స్ తో బ్యానర్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో నిర్మిస్తున్నారు. దర్శక ద్వయం సుజీత్, సందీప్ విలేజ్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్ కథతో ”క” సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 31న దీపావళి పండుగ సందర్భంగా తెలుగులో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. “క” సినిమాను తెలుగులో ప్రొడ్యూసర్ వంశీ నందిపాటి, మలయాళంలో హీరో దుల్కర్ సల్మాన్ తన వేఫర్ ఫిలింస్ పై రిలీజ్ చేయబోతున్నారు. లేటెస్ట్ ఇంటర్వ్యూలో “క” సినిమా హైలైట్స్ తో పాటు ఈ చిత్రంలో నటించిన ఎక్సిపీరియన్స్ తెలిపారు హీరోయిన్స్ నయన్ సారిక, తన్వీ రామ్.
నయన్ సారిక మాట్లాడుతూ
———————————–
– నేను ఆయ్ సినిమాలో నటిస్తున్న టైమ్ లో నా ఫొటోస్ ఇండస్ట్రీలో ఫిలింమేకర్స్ దగ్గరకు సర్క్యులేట్ అయ్యాయి. అలా “క” సినిమా అవకాశం నా దగ్గరకు వచ్చింది. నేను అప్పుడు ఆయ్ సినిమా షూటింగ్ కోసం ఏపీలో ఉన్నాను. డైరెక్టర్ సందీప్ ఫోన్ చేసి మూవీ గురించి చెప్పారు. నేను హైదరాబాద్ వచ్చాక లుక్ టెస్ట్ చేశాను. ఆ టెస్ట్ అయ్యాక “క” సినిమాలో సత్యభామ క్యారెక్టర్ కోసం తీసుకున్నారు.
– గం గం గణేశాలో మోడరన్ గా ఉంటాను, ఆయ్ సినిమాలో ట్రెడిషనల్ గా కనిపిస్తా. ఆయ్ లో పల్లవి క్యారెక్టర్ చాలా బబ్లీగా ఉంటుంది. ఆ పాత్రకు భిన్నమైన రోల్ చేయాలని కోరుకున్నా. అనుకున్నట్లుగానే “క” సినిమాలో సత్యభామ పాత్ర దక్కింది. ఈ చిత్రంలో పూర్తిగా ట్రెడిషనల్ గా కనిపిస్తా. ఈ మూవీ కథ విన్నప్పుడు క్లైమాక్స్ మనసులో గుర్తుండిపోయింది. థియేటర్స్ లో మూవీ రిలీజ్ అయ్యాక ప్రేక్షకులు కూడా ఇదే అనుభూతికి లోనవుతారు.
– కిరణ్ అబ్బవరంతో కలిసి పనిచేయడం హ్యాపీగా ఉంది. ఆయన ఈ ప్రాజెక్ట్ లో ఎంతో ఇన్వాల్వ్ అయ్యారు. ఆయన ఎవరి వర్క్ లోనూ ఇంటర్ ఫియర్ కాలేదు. ప్రతి క్రాఫ్ట్ నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకునేవారు. ఈ సినిమాలోని యాక్షన్స్ సీక్వెన్స్ రిస్క్ అయినా ఆయనే స్వతహాగా చేశారు. డూప్ ను పెట్టుకోలేదు. యాక్షన్ ఒరిజినల్ గా రావాలని కిరణ్ గారు ప్రయత్నించారు. సినిమా కోసం ఎంతో డెడికేషన్ తో ఉండటాన్ని కిరణ్ గారి దగ్గర నుంచి నేర్చుకోవాలి. ఆయనలో నేను అడ్మైర్ చేసే విషయం అదే.
– “క” లో ఇద్దరు హీరోయిన్స్ ఉన్నాం. హీరో ఎవరికి పెయిర్ అనేది మూవీలోనే చూడాలి. ఈ కథలో ఎన్నో ట్విస్ట్స్ అండ్ టర్న్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎక్కువ చెబితే ఆ కిక్ థియేటర్ లో మిస్ అవుతుంది. అందుకే ఎక్కువగా రివీల్ చేయడం లేదు. నేను తన్వీ కలిసి చేసిన సీన్స్ తక్కువ. తక్కువ టైమ్ లో మేమంతా మంచి ఫ్రెండ్స్ అయ్యాం. సినిమా టీమ్ మొత్తం ఫ్యామిలీలా కలిసిపోయిన వర్క్ చేశారు. క సినిమా టైటిల్ హీరో క్యారెక్టర్ వాసుదేవ్ కు కనెక్ట్ అయి ఉంటుంది.
– ఈ సినిమాలో నా సత్యభామ క్యారెక్టర్ లుక్ కోసం సావిత్రి గారి లుక్ ను రిఫరెన్స్ గా తీసుకున్నారు. అందుకే హీరో నేను సావిత్రిలా ఉన్నానని డైలాగ్ చెబుతాడు. సావిత్రి గారిలా నేను గ్లిజరిన్ లేకుండా కన్నీళ్ల సీన్ చేయగలను. ఆమె మహానటి చూసి చాలా ఇన్స్ పైర్ అయ్యాను. నా సత్యభామ క్యారెక్టర్ ను సావిత్రి గారిలా ఉన్నానని హీరో చెప్పే డైలాగ్ చాలా రిలవెంట్ గా ఉందని డైరెక్టర్స్ అన్నారు. మా డైరెక్టర్స్ సందీప్ సుజీత్ ఇద్దరూ ఒకే థాట్ ప్రాసెస్ తో ఉండేవారు. వాళ్లు ఎక్కడా డిఫరెన్స్ రాకుండా బాగా మూవీని తెరకెక్కించారు.
– మా మూవీలో యానివర్సల్ పాయింట్ ఉంది. అందుకే కిరణ్ గారు ఈ సినిమాను పాన్ ఇండియా రిలీజ్ చేయాలని అనుకున్నారు. ఏ ఒక్కరికో పరిమితం కాని కథ ఇది. ఈ సినిమాలో మేము చూపించబోయే ఎలిమెంట్స్ ప్రతి ఒక్కరూ రిలేట్ చేసుకునేలా ఉంటాయి. ప్రేక్షకులకు సరికొత్త సినిమాను ఇవ్వబోతున్నాం. సినిమా చివరలో ఇలా మనమూ ఉండొచ్చు కదా అనే రియలైజేషన్ కు ప్రేక్షకులు వస్తారు. ఇలాంటి పాయింట్ ను మన సినిమాల్లో ఎక్కడా చూసి, విని ఉండరు. అందుకే మా మూవీ టీమ్ అంతా సక్సెస్ మీద నమ్మకంతో ఉన్నాం. ప్రస్తుతం కొన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ కు డిస్కషన్స్ జరుగుతున్నాయి. త్వరలో వాటి డీటెయిల్స్ వెల్లడిస్తా.
హీరోయిన్ తన్వీ రామ్ మాట్లాడుతూ
——————————————-
– నేను తెలుగులో నాని హీరోగా నటించిన అంటే సుందరానికీ సినిమాలో నటించాను. ఆ సినిమా కథలో ఓ ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో కనిపించాను. ఒక సినిమా సెలెక్ట్ చేసుకునే ముందు నా క్యారెక్టర్ కథలో ఎంత కీలకంగా ఉందనేది చూసుకుంటాను. హీరోయిన్ గానే కనిపించాలని అనుకోవడం లేదు. “క” సినిమాలో రాధ అనే క్యారెక్టర్ చేశాను. డైరెక్టర్ సందీప్ నాకు ఫోన్ లో కొంత నెరేషన్ ఇచ్చారు. నేను పూర్తిగా వినాలని చెబితే కంప్లీట్ స్క్రిప్ట్ నా క్యారెక్టర్ తో సహా చెప్పారు. రాధ క్యారెక్టర్ ఎంత ఇంపార్టెంట్ అనేది తెలిసింది. వెంటనే ఒప్పుకున్నాను.
– రాధ ఒక స్కూల్ టీచర్. అభినయ వాసుదేవ్, సత్యభామ ఒక టైమ్ ఫ్రేమ్ లో కనిపిస్తే, నేను మరో పీరియడ్ లో కనిపిస్తా. నా పాత్రకు వారి పాత్రలకు మధ్య కనెక్షన్ ఏంటనేది స్క్రీన్ మీదే చూడాలి. సత్యభామ పాత్రతో నాకు సీన్స్ ఉండవు. క సినిమా రిలీజ్ అయ్యాక నేను ఈ సినిమా గురించి ఎక్కువ మాట్లాడాలి అనుకుంటున్నా. ఇప్పుడే చెబితే థ్రిల్ రివీల్ అవుతుంది.
– నేను క సినిమా కోసం హైదరాబాద్ వచ్చినప్పుడు కిరణ్ గారు వేరే ప్లేస్ కు వెళ్తున్నారు. నేను వస్తున్నానని తెలిసి కలిసి మాట్లాడారు. కో ఆర్టిస్టులను కిరణ్ గారు బాగా గౌరవిస్తారు. ఆయన ఈ సినిమా కోసం చూపించిన డెడికేషన్ అద్భుతమనే చెప్పాలి. ప్రతి విషయంలో ఆయన జాగ్రత్తలు తీసుకున్నారు. మాకు ఎంతో సపోర్ట్ చేశారు. కిరణ్ గారు ఇచ్చిన ఎంకరేజ్ మెంట్ తో టీమ్ అంతా బాగా పనిచేశారు.
– ఈ సినిమాలో ప్రతి క్యారెక్టర్ కు ఇంపార్టెన్స్ ఉంది. కృష్ణగిరి అనే ఊరు కూడా ఒక కీ రోల్ ప్లే చేస్తుంది. ప్రతి క్యారెక్టర్ లో ట్విస్ట్ లు టర్న్స్ ఉంటాయి. క్లైమాక్స్ మాత్రం మరో స్థాయిలో ఉంటుంది. మా అందరినీ కథకు బాగా కనెక్ట్ చేసింది పతాక సన్నివేశాలే. మొత్తం సినిమా సమ్మరీ చెప్పాలంటే క టైటిల్ లోనే ఉంది. కథలోని ఎన్నో ఎమోషన్స్ మా క్యారెక్టర్ ద్వారా రిఫ్లెక్ట్ అవుతాయి.
– మా సినిమాకు అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువే అయ్యింది. అయితే మా ప్రొడ్యూసర్ గారు ఎంతో ఎంకరేజ్ చేస్తూ టీమ్ కు తన సపోర్ట్ అందించారు. మంచి క్వాలిటీ మూవీ చేయాలని ఆయన కోరుకున్నారు.
– నేను చేసిన రాధ క్యారెక్టర్ ఎక్కువ నైట్ షూట్స్ చేశారు. నేను ఎర్లీగా నిద్రపోతుంటా. నైట్ షూట్ కాబట్టి మెలకువగా ఉండాల్సివచ్చింది. ఇది ఛాలెంజింగ్ గా అనిపించింది. అలాగే నేను సరదాగా నవ్వుతూ ఉంటాను. రాధ క్యారెక్టర్ కొన్నిసార్లు ఏడవాల్సిఉంటుంది. ఆ లాంగ్ సీక్వెన్స్ సీన్స్ అనేకసార్లు, వివిధ యాంగిల్స్ లో షూట్ చేశారు. అప్పుడు మళ్లీ మళ్లీ అదే ఎమోషన్ తో ఏడవాల్సివచ్చింది. ఇలా నా పర్సనల్ లైఫ్ క్యారెక్టర్ కు భిన్నంగా సెట్ లో ఉండటం వ్యక్తిగతంగా నాపై ప్రభావం చూపించింది. అయితే నటిగా నేను ఇవన్నీ వృత్తిలో భాగంగా తీసుకోవాల్సిందే.
– క సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యాక మంచి రెస్పాన్స్ వచ్చింది. నా ఫ్రెండ్స్, ఫ్యామిలీ అంతా మూవీ చూసేందుకు వెయిట్ చేస్తున్నారు. క సినిమాకు సెకండ్ పార్ట్ కు లీడ్ ఉంటుంది. కానీ సీక్వెల్ గురించి తర్వాత చెబుతాం. ప్రస్తుతం తమిళం, మలయాళంలో మల్టిపుల్ ప్రాజెక్ట్స్ చేస్తున్నా. క రిలీజ్ తర్వాత తెలుగులోనూ మంచి ఆఫర్స్ వస్తాయని ఆశిస్తున్నా.