స్వదేశానికి తిరిగి వచ్చిన…శ్రీలంక మాజీ అధ్యక్షుడు

శ్రీలంక మాజీ అధ్యక్షుడు గోటబయ రాజపక్ష సంక్షోభం నేపథ్యంలో ఆ దేశాన్ని విడిచి పారిపోయారు. కాగా ఆయన మళ్లీ స్వదేశానికి వచ్చిన సందర్భంగా ఆయనకు మంత్రులు, రాజకీయవేత్తలు, ఎయిర్‌పోర్ట్‌ వద్ద స్వాగతం పలికినట్లు తెలుస్తోంది. విమానం నుంచి గోటబయ దిగగానే రాజకీయవేత్తలు పూలమాలలతో పరుగెత్తుకు వచ్చినట్లు ఓ ఎయిర్‌పోర్టు అధికారి తెలిపారు. జూలై నెలలో మిలిటరీ సహాయంతో రాజపక్ష దేశాన్ని విడిచి వెళ్లారు. తొలుత సింగపూర్‌, ఆ తర్వాత థాయిలాండ్‌ వెళ్లిన గోటబయి తన  రాజీనామా లేఖను పంపారు. 52 రోజుల పాటు దూరంగా ఉన్న గోటబయ బ్యాంకాక్‌ నుంచి సింగపూర్‌ మీదులా శ్రీలంక చేరుకున్నారు.

Related Posts

Latest News Updates