ఆటో డ్రైవర్ల బతుకులు మార్చే చిత్రం ‘కైజర్’.. ప్రెస్ మీట్

సహచారి క్రియేషన్స్ బ్యానర్‌పై రోహన్ కులకర్ణి నిజజీవిత కథ ఆధారంగా తెరకెక్కిన వెబ్ సిరీస్ చిత్రం కైజర్. యంగ్ డైరెక్టర్ వికాస్ చిక్బల్లాపూర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మార్చి 31న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈస్ట్ వెస్ట్ ఎంటర్ టైన్మెంట్ డిస్ట్రీబ్యూటర్ లో ప్రముఖ ఓటీటీ సంస్థలు అమెజాన్ ప్రైమ్, ఎమ్ఎక్స్ ప్లేయర్లలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సందర్భంగా ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆటో డ్రైవర్ల కష్టాలు ఎలా ఉంటాయి, వారిని ఆదుకోవడానికి రోహాన్ కులకర్ణి ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు. రోకు యాప్ ఆటో డ్రైవర్లకు ఎలా ఉపయోగపడుతుందో ఈ సినిమాలో అద్భుతంగా చూపించినట్లు డైరెక్టర్ వికాస్ చిక్బల్లాపూర్ వివరించారు.

డైరెక్టర్ వికాస్ ఇంకా మాట్లాడుతూ.. ఈ కథను ప్రతీ ఆటో డ్రైవర్‌కు చేరవేయాలని దానికి మీడియా సపోర్ట్ కావాలి అన్నారు. కైజర్ చిత్రం రోహన్ కులకర్ణి రియల్ స్టోరీ అని పేర్కొన్నారు. రోకు కాన్సెప్ట్ పైనా సినిమా తీయాలి అనే ఆలోచన వచ్చిన వెంటనే కథను సిద్దం చేసుకోవడం, షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ ఇలా అన్ని పనులు చాలా తొందరగా అయిపోయాయి అని డైరెక్టర్ తెలిపారు. సినిమాలో చాలా మంది రియల్ ఆటో డ్రైవర్లను చూపించాము అని తెలిపారు. డైలాగ్స్ రైటర్ ఫనీకి, సీనియర్ యాక్టర్లు కోటేశ్వరరావు, ప్రసాద్, హీరో రవి మహదాస్యమ్ ఈ సినిమాకు పనిచేసిన అందరికీ థ్యాంక్స్ చెప్పారు. ఇక సినిమాలో సృజన గోపాల్ కేవలం స్టోరీ, స్క్రీన్ ప్లే నే కాదు అన్ని పనులు తనదే అన్నట్లు చాలా యాక్టీవ్ గా చేశారు అని వెల్లడించారు. ఇక ఈ సిరీస్ ను జనాల వద్దకు నేను తీసుకెళ్తా అని ముందుకొచ్చిన ఈస్ట్ వెస్ట్ ఎంటర్ టైన్మెంట్ అధినేత రాజీవ్ కు ధన్యవాదాలు తెలిపారు.

స్టోరీ, స్క్రీన్ ప్లే రైటర్ సృజన గోపాల్ మాట్లాడుతూ.. చిన్న కాన్సెప్ట్ ప్రజలకు తెలియాలి అన్నా, చిన్నా, పెద్ద సినిమా అనే తేడా లేకుంటా కంటెంట్ ని ముందుకు తీసుకెళ్లే మీడియాకు థాంక్స్ చెప్పారు. డైరెక్టర్ వికాస్ ఇక నెలలోనే సినిమా పూర్తి చేశారు అంటే మాములు విషయం కాదు. దాన్ని వికాస్ సాధించి చూపించారు అని తెలిపారు. రోహన్ రోల్ చేసిన రవి మహాదాస్యం చాలా నాచురల్ గా చేశారు. సుశాంత్ ఆటో డ్రైవర్ గా బాగా చేశారు. ఈ చిన్న చిత్రానికి పేరున్న నటులు కోటేశ్వర రావు, బీహెచ్ఎల్ ప్రసాద్ పెద్ద ఆస్తి అన్నారు. అలాగే కాస్ట్ అండ్ క్రూ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అవకాశం ఇచ్చిన రోహన్ కులకర్ణి, వాల్ల నాన్న దేవ్ కు థ్యాంక్స్ చెప్పారు.

హీరో రవి మహదాస్యమ్ మాట్లాడుతూ.. స్టోరీ విన్నవెంటనే చాలా బాగుంది చేద్దాం అని ఫిక్స్ అయ్యాన్నారు. అయితే ఇంత తొందరగా సినిమా అయిపోయి ప్రేక్షకుల ముందుకు వస్తుందని అనుకోలేదన్నారు. దానికి మొత్తం క్రెడిట్ డైరెక్టర్ వికాస్ కే ఇవ్వాలి అని పేర్కొన్నారు. ఇక రోహాన్ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు ఆయన గురించి తెలుసుకొని చాలా ప్రభావితుడిని అయినట్లు తెలిపారు. వారు చాలా సేవలు చేస్తున్నారు. ఆటో డ్రైవర్ల కోసం యాప్ ను తీసుకురావడమే కాదు, వారి పిల్లలను కూడా చదివించడం అంటే మాములు విషయం కాదు అన్నారు. ఈ సినిమా చూసిన తరువాత ఆటో వాళ్లను చూసే విధానం మారిపోతుంది అన్నారు.

సమాజానికి ఎదో చేయడానికే మనల్ని దేవుడు పుట్టించాడు అని నమ్ముతాను అని ఈస్ట్ వెస్ట్ ఎంటర్ టైనర్ అధినేత రాజీవ్ అన్నారు. రోహాన్ కులకర్ణి, వాళ్ల నాన్న దేవ్ చేసే సేవలు చూసి ఎంతో ఇన్ స్పైర్ అయినట్లు పేర్కొన్నారు. రోకు అనే యాప్ కేవలం ఆటో డ్రైవర్లు కోసం అని అది వారికి ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. రోహన్ సమాజానికి సేవ చేస్తున్నారని.. ఈ సినిమా చూస్తే అతడి శ్రమ ఏంటో తెలుస్తుందని అన్నారు. ఇక ఈ కంటెంట్ ను ప్రపంచానికి చూపించే బాధ్యత తనది అని పేర్కొన్నారు.

సీనియర్ యాక్టర్ కోటేశ్వరరావు, బీహెచ్ఎల్ ప్రసాద్ ఇద్దరు ఇలాంటి యంగ్ టీంతో పని చేయడం ఎంతో సంతోషం అని అన్నారు.
ఒక యాప్ ని నిర్మించి దాన్ని ప్రజలకు తెలియాలని ఓ సినిమా తీయడం అనేది చాలా తెలివైన ఆలోచన అని అన్నారు. బయట జరిగే చాలా అంశాలు కైజర్ అద్భుతంగా చూపించారని పేర్కొన్నారు. అలాగే చాలా తక్కువ సమయంలో మ్యాజిక్ ఇచ్చాను అని అందరూ చాలా బాగుంది అనడం సంతోషంగా ఉందని మ్యూజిక్ డైరెక్టర్ పవన్ పేర్కొన్నారు. అలాగే ఫనీ శ్రీకాంత్ మాట్లాడుతూ.. డైలాగ్స్ రాసే అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్లకు థ్యాంక్స్ చెప్పారు.

రోహాన్ మాట్లాడుతూ.. కైజర్ అంటే రాజు అని, హిట్లర్ సుభాష్ చంద్రబోస్‌ను కైజర్ అని పిలిచేవారని అందుకే ఈ చిత్రానికి కైజర్ అని పేరు పెట్టినట్లు పేర్కొన్నారు. సినిమా చాలా తొందరగా, ఇంత అద్భుతంగా రావడం వెనుక డైనమిక్ టీమ్ పనిచేసిందని వెల్లడించారు. రోహాన్ తండ్రి దేవ్ మాట్లాడుతూ.. రోహన్ తన కొడుకు ఐనందుకు చాలా సంతోషంగా ఉందని అని అన్నారు. మంచి చేసే తన కుమారుడి గురించి ఎవరు ఎన్ని చెప్పినా ఎప్పుడూ పట్టించుకోలేదని అందుకే ఈ రోజు తన కొడుకు అద్భతం చేసిన చూపించారు అని పేర్కొన్నారు. ఆటో డ్రైవర్లు వాడే రకరకాల రైడింగ్ యాప్ లు వారిని దోసుకుంటున్నాయని, అందుకే వారికోసం రోకు అనే యాప్ తీసుకొచ్చామని, ఇదే ఈ సినిమా కథ అని పేర్కొన్నారు. కేవలం యాప్ తోనే కాదు ఆటో డ్రైవర్ల కోసం లైఫ్ ఇన్సురెన్స్ అందిస్తున్నట్లు, వారి పిల్లల చదువుల కోసం వోచర్స్ కూడా అందిస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడుతామని వెల్లడించారు. ఈ చిత్రం మార్చి 31న ఓటీటీ వేదికలైన అమెజాన్ ప్రైమ్, ఎమ్ఎక్స్ ప్లేయర్లో స్ట్రీమింగ్ అవుతున్నట్లు పేర్కొన్నారు.

సుశాంత్ యష్కీ మాట్లాడుతూ ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్, ప్రొడ్యూసర్లకు థ్యాంక్స్ చెప్పారు. అలాగే సృజన గోపాల్ వలనే తాను ఈ ప్రాజెక్టులో ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ చిత్రంలో ఆటో డ్రైవర్ రాముగా నటించినట్లు పేర్కొన్నారు. ఈ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు చాలా మంది ఆటో డ్రైవర్లతో మాట్లాడినట్లు చెప్పారు. అప్పుడే వాళ్ల నిజమైన బాధలు తెలిసినట్లు ఆయన పేర్కొన్నారు.

చిత్రం: కైజర్
నటీనటులు: రవి మహదేవస్యం, సుశాంత్ యష్కీ, కోటేశ్వరరావు, బీహెచ్ఎల్ ప్రసాద్ తదితరులు
బ్యానర్: సహచారి క్రియేషన్స్
డైరెక్టర్ : వికాస్ చిక్బల్లాపూర్
నిర్మాత: సహచారి క్రియేషన్స్
కథ, స్క్రీన్ ప్లే: సృజన గోపాల్
డీఓపీ అండ్ ఎడిటింగ్: వికాస్ చిక్బల్లాపూర్
మ్యూజిక్: పవన్
ఆర్ట్: హర్ష
డైలాగ్స్: వావిలాల ఫినీ శ్రీకాంత్
పీఆర్ఓ: హరీష్, దినేష్

Related Posts

Latest News Updates