ఆస్కార్ అవార్డుల్లో భారత్‌ బోణీ.. బెస్ట్‌ డాక్యుమెంటరీ షార్ట్‌ ఫిల్మ్‌గా ”ద ఎలిఫెంట్‌ విష్పరర్స్‌”

ఆస్కార్ అవార్డుల్లో భారత్‌ బోణీ కొట్టింది. బెస్ట్‌ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్‌ విభాగంలో ‘ద ఎలిఫెంట్ విష్పరర్స్‌’ (The Elephant Whisperers) షార్ట్‌ ఫిల్మ్‌ కేటగిరీలో ఆస్కార్‌ అవార్డును సొంతం చేసుకున్నది. దీనిని డాక్యుమెంటరీని దర్శకురాలు కార్తికి గోన్సాల్వేస్‌ రూపొందించారు. నెట్‌ఫ్లిక్స్‌ సంస్థ డిస్ట్రిబ్యూట్‌ చేసింది. ‘ది బాయ్, ది మోల్, ది ఫాక్స్ అండ్ ది హార్స్’ సినిమాకు ఉత్తమ యానిమేటెడ్ ఫిల్మ్ కేటగిరీలో అవార్డు లభించింది. చార్లీ మెక్సీ, మాథ్యూ ఫ్రూడ్‌ దీనిని రూపొందించారు.

‘ద ఎలిఫెంట్ విష్పరర్స్’ విషయానికి వస్తే… రెండు పిల్ల ఏనుగుల కథే ఈ డాక్యుమెంటరీ. ఏనుగుల గుంపు నుంచి విడిపోయిన ఆ ఏనుగు పిల్లలకు తమిళనాడు అటవీ శాఖ తప్పెకాడు ఎలిఫ్యాంట్ క్యాంపులో పునరావాసం కల్పిస్తోంది. గత 140 ఏళ్లుగా అక్కడి అటవీశాఖ ఇటువంటి పని చేస్తోంది. తల్లి నుంచి వేరుపడిపోయిన ఏనుగులు పరిసర గ్రామల మీద పడి ప్రజలను ఇబ్బంది పెట్టకుండా… అవి బెం గపెట్టుకుని చనిపోకుండా కాడు నాయగన్ అనే ఓ గిరిజన తెగకు వాటిని అప్పగిస్తూ ఉంటారు.

‘కాడు నాయగన్’ తెగ అడవి జంతువులను కుటుంబ సభ్యుల్లా చూసుకుంటుంది. అటవీ జంతువులు, ఏనుగు పిల్లలను పెంచడంలో ఆ తెగకు తరతరాల వారసత్వం ఉంది. అలా బొమ్మన్, బెల్లీ అనే దంపతులకు రఘు, అమ్ము అనే చిన్న ఏనుగులను పెంచే బాధ్యతను ఫారెస్ట్ ఆఫీసర్స్ అప్పగిస్తారు. వాటిని కుటుంబ సభ్యుల వలే ఎలా పెంచారు? ఆ చిన్న చిన్న ఏనుగు పిల్లలు చేసే చిలిపి పనులు, అల్లరి ఏంటి? బొమ్మన్, బెల్లీతో ఆ ఏనుగులు ఎటువంటి అనుబంధం పెంచుకున్నాయి? అనేది ఈ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ కథ.

Related Posts

Latest News Updates