పార్లమెంట్ శీతాకాల సమావేశాల తేదీలు ఖరారు

పార్లమెంట్ శీతాకాల సమావేశాల తేదీలు ఖరారయ్యాయి. గత కొన్నేళ్లుగా ప్రతియేటా నవంబర్ మాసాంతంలో మొదలై డిసెంబర్లో ముగిసేలా సమావేశాల తేదీలను ఖరారు చేస్తుండగా, ఈసారి సమావేశాలు కాస్త ఆలస్యంగా డిసెంబర్ 7న మొదలై 29న ముగియనున్నట్టు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు. రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలో సమావేశమైన పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ ఇవే తేదీలను సిఫార్సు చేసిన విషయం తెలిసిందే. 23 రోజుల వ్యవధిలో జరగనున్న ఈ సమావేశాల్లో మొత్తం 17 పనిదినాలు ఉంటాయి. సమావేశాల మొదటి రోజు సిట్టింగ్ సభ్యుల మృతికి సంతాపం ప్రకటిస్తూ వాయిదా వేసే అవకాశం ఉంది. ఈ మధ్యకాలంలో చనిపోయినవారిలో సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకులు, మాజీ మంత్రి ములాయం సింగ్ యాదవ్‌ ఉన్నారు.

Related Posts

Latest News Updates