అక్టోబర్ 13న రిలీజ్ అవుతోన్న మా ‘నీతోనే నేను’ సినిమా చూసిన ఆడియెన్స్..ఓ మంచి సినిమా చూశామనే ఫీలింగ్‌తో బ‌య‌ట‌కొస్తారు: చిత్ర నిర్మాత ఎమ్‌.సుధాక‌ర్ రెడ్డి

‘సినిమా బండి’ ఫేమ్ వికాష్ వ‌శిష్ట హీరోగా మోక్ష‌, కుషిత క‌ళ్ల‌పు హీరోయిన్లుగా శ్రీమామిడి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై అంజిరామ్ ద‌ర్శ‌క‌త్వంలో ఎమ్‌.సుధాక‌ర్ రెడ్డి నిర్మించిన చిత్రం ‘నీతోనే నేను’. అక్టోబ‌ర్ 13న రిలీజ్ అవుతోన్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను మెద‌క్‌లో ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ వేడుక‌లో చిత్ర యూనిట్ సభ్యులతో పాటు పలువురు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో….

చిత్ర నిర్మాత ఎమ్‌.సుధాక‌ర్ రెడ్డి మాట్లాడుతూ ‘‘‘నీతోనే నేను’ కథను రాయటానికి డిసెంబర్ నుంచి మే వరకు ఎంటైర్ టీమ్‌తో క‌లిసి డిస్క‌ష‌న్ చేసుకుంటూ వ‌చ్చాను. మే నెల‌లో క‌థ పూర్తి కాగానే షూటింగ్‌ను స్టార్ట్ చేశాం. కేవ‌లం 33 రోజుల్లోనే సినిమా షూటింగ్‌ను కంప్లీట్ చేశాం. సింగిల్ షెడ్యూల్‌లో ప్లానింగ్ ప్రకారం మూవీని పూర్తి చేశాం. డైరెక్ట‌ర్ అంజి రామ్‌, మ్యూజిక్ డైరెక్ట‌ర్ కార్తీక్‌, డాన్స్ మాస్ట‌ర్ అనీష్‌, కో డైరెక్ట‌ర్ కిర‌ణ్‌, సినిమాటోగ్రాఫ‌ర్ ముర‌ళీ మోహ‌న్‌గారు స‌హా అంద‌రికీ థాంక్స్‌. టీచ‌ర్స్ మీద సినిమా చేస్తున్నారేంటి అని ఈ జ‌ర్నీలో న‌న్ను చాలా మంది అడిగారు. అంటే మంచి క‌మ‌ర్షియ‌ల్ సినిమా చేయ‌వ‌చ్చు క‌దా అనేది వాళ్ల అభిప్రాయం. కానీ నా ఉపాధ్యాయుల మీద‌, నా క‌థ మీద‌, నా టీమ్ మీద‌, నా మీద నాకు ఉన్న న‌మ్మ‌కంతో ముందుకు అడుగులు వేస్తూ వ‌చ్చాను. అక్టోబ‌ర్ 13న ఈ సినిమా రిలీజ్‌కి సిద్ధం చేశాను. నా టీమ్‌తో క‌లిసి సినిమాను చూశాం. సినిమా చాలా బావుంద‌ని నా టీమ్ స‌భ్యులు చెప్పారు. వంద శాతం సినిమా పెద్ద స‌క్సెస్ అవుతుంద‌ని సినిమా చూసిన వారు చెబుతున్నారు. క‌చ్చితంగా ‘నీతోనే నేను’ సినిమాను చూసిన మెద‌క్ వాళ్లంద‌రూ…మా ప్రాంత‌వాసి చేసిన సినిమా అని గొప్ప‌గా చెప్పుకుంటారు. మంచి సినిమా చూశామని ప్రేక్షకులు చెబుుతారు’’ అన్నారు.

ద‌ర్శ‌కుడు అంజిరామ్ మాట్లాడుతూ ‘‘మెదక్‌లో ‘నీతోనే నేను’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వ‌హించ‌టం చాలా ఆనందంగా ఉంది. నాలుగు నెల‌ల పాటు ఎంటైర్ టీమ్ క‌ష్ట‌ప‌డింది. అందువ‌ల్లే సినిమాను అక్టోబ‌ర్ 13న రిలీజ్ చేయ‌టానికి సిద్ధ‌మ‌య్యాం. మా సినిమాటోగ్రాఫ‌ర్ ముర‌ళీ మోహ‌న్ రెడ్డిగారు, మా మ్యూజిక్ డైరెక్ట‌ర్ కార్తీక్‌గారు ఈ జ‌ర్నీలో అందించిన స‌పోర్ట్ గురించి ఎంత చెప్పినా త‌క్కువే. యాక్ట‌ర్స్‌ హీరో వికాస్ వశిష్ట‌, మోక్ష‌, కుషిత క‌ళ్ల‌పు, ఆకెళ్ల స‌హా అంద‌రూ చ‌క్క‌గా న‌టించారు. ఇక నిర్మాత సుధాక‌ర్ రెడ్డిగారైతే మా వెనుకుండి ముందుకు న‌డిపించారు. ఇండ‌స్ట్రీలోకి కొత్త‌గా అడుగు పెట్టిన‌ప్ప‌టికీ ఆయ‌న డేడికేష‌న్, క‌మిట్‌మెంట్‌తో సినిమాను కంప్లీట్ చేశారు. ఆయ‌న అందించిన స‌పోర్ట్‌కి ధ‌న్య‌వాదాలు. కిర‌ణ్‌గారికి, తేజ‌గారికి, ఎడిట‌ర్ ప్ర‌తాప్ స‌హా టీమ్‌కి థాంక్స్‌. అక్టోబ‌ర్ 13న థియేట‌ర్స్‌లోకి వ‌స్తున్నాం’’ అన్నారు.

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ ఎమ్‌.ప్ర‌భాక‌ర్ రెడ్డి మాట్లాడుతూ ‘‘సమాజాన్ని గొప్పగా తీర్చి దిద్దే టీచర్స్‌కి సంబంధించిన క‌థతో ‘నీతోనే నేను’ సినిమా చేశాం. సినిమా చాలా బాగా వ‌చ్చింది. సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమా క్లీన్ యు స‌ర్టిఫికేట్‌ను పొందింది. సెన్సార్ స‌భ్యులు కూడా మూవీని అప్రిషియేట్ చేశారు. అక్టోబ‌ర్ 13న మూవీని రిలీజ్ చేస్తున్నాం’’ అన్నారు.

మ్యూజిక్ డైరెక్ట‌ర్ కార్తీక్ మాట్లాడుతూ ‘‘మెదక్ ప్రాంతం నుంచి పవర్ఫుల్ లీడర్స్ వచ్చారు. అలాంటి మెదక్ నుంచి వచ్చిన సుధాకర్ రెడ్డిగారు ‘నీతోనే నేను’ అనే మంచి సినిమాతో మెప్పించ‌టానికి సిద్ధ‌మ‌య్యారు. అక్టోబ‌ర్ 13న మూవీ రిలీజ్ కానుంది. ఇందులో టీచ‌ర్స్‌కు సంబంధించిన పాట వ‌స్తే ఇది టీచ‌ర్స్‌కు సంబంధించిన సినిమా అన్నారు. ఆ త‌ర్వాత మందుకు సంబంధించిన పాట రిలీజైంది. స్కూల్స్‌లో ఉండే స‌మ‌స్య‌లపై మ‌న‌సుకి హ‌త్తుకునేలా ఈ సినిమాను తెర‌కెక్కించారు. డైరెక్ట‌ర్ అంజిరామ్‌, నాగ‌రాజ్‌గారి వ‌ల్ల ఈ ప్రాజెక్ట్‌లోకి అడుగు పెట్టాను. పాట‌ల‌న్నింటికీ సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌చ్చింది. నిర్మాత సుధాక‌ర్ రెడ్డిగారు ప్ర‌తీ విష‌యంలో ఎన్నో జాగ్ర‌త్త‌లు తీసుకుని మ‌రీ సినిమాను చేశారు. త‌ప్ప‌కుండా సినిమా అంద‌రికీ న‌చ్చుతుంది’’ అన్నారు.

న‌టీనటులు:

వికాస్ వ‌శిష్ట‌, మోక్ష‌, కుషిత, అకెళ్ల త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:

బ్యాన‌ర్‌: శ్రీమామిడి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌
నిర్మాత‌: ఎమ్‌.సుధాక‌ర్ రెడ్డి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎమ్.ప్రభాకర్ రెడ్డి
ద‌ర్శ‌క‌త్వం: అంజిరామ్‌
సంగీతం: కార్తీక్ బి.క‌డ‌గండ్ల‌
సినిమాటోగ్రాఫ‌ర్‌: ముర‌ళీ మోహ‌న్

Related Posts

Latest News Updates