సలార్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ప్రభాస్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. సైన్స్ ఫిక్షన్ జానర్‌లో వస్తున్న ఈ చిత్రానికి మహానటి సినిమా ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, గ్లింప్స్‌లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఇదిలావుంటే తాజాగా ఈ సినిమా టైటిల్‌పై ఇంట్రెస్టింగ్ న్యూస్ పంచుకున్నాడు దర్శకుడు నాగ్ అశ్విన్. https://cinemaabazar.com/
ఈ సినిమాకు ‘కల్కి 2898 ఏడీ’ అని పెట్టినప్పటినుంచి ప్రభాస్ అభిమానులతో పాటు సినీ ప్రియుల్లో ఆసక్తి నెలకొన్న విషయం తెలిసిందే. తాజాగా ఈ టైటిల్ ‘కల్కి 2898 ఏడీ’ అని పెట్టడానికి గల కారణాన్ని నాగ్ అశ్విన్ వెల్లడించారు. https://cinemaabazar.com/
ఈ సినిమా భారతీయ పురాతన ఇతిహాసం మహాభారతం కాలం నుంచి ప్రారంభమై 2898 సంవత్సరంతో పూర్తవుతుంది. గతంతో మొదలై ఫ్యూచర్‌తో ముగుస్తుంది కాబట్టి ఈ టైటిల్ పెట్టాం. ఈ సినిమాలో మొత్తం 6000 ఏండ్ల మధ్య జరిగే కథను చూపించబోతున్నాం. దానికి తగ్గట్లు ఓ సరికొత్త ప్రపంచాన్ని సృష్టించాం. అంటూ నాగ్ అశ్విన్ వెల్లడించాడు. ఈ సినిమా మే 9న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుంది. అత్యంత భారీ బడ్జెట్‌తో వైజయంతి మూవీస్ బ్యానర్‌పై అశ్వనీదత్ ఈ సినిమాను నిర్మిస్తుండగా.. ప్రభాస్, అమితాబ్, కమల్‌హాసన్, దీపిక పదుకొణే, దిశా పటానీ, పశుపతి లాంటి సూపర్‌స్టార్స్ ఇందులో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. https://cinemaabazar.com/