బింబిసార ఫేమ్ వశిష్ఠ దర్వకత్వంలో మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర అనే సోషియో ఫాంటసీ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ఇంటర్వెల్ బ్లాక్ ను 26 రోజుల లాంగ్ షెడ్యూల్ లో పూర్తి చేశారు. భారీ ఎత్తున జరిగే ఈ యాక్షన్ సీక్వెన్స్ యాక్షన్ కొరియోగ్రఫర్స్ రామ్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో తెరకెక్కించారు. ఈ ఇది చిరూ కెరీర్లోనే భారీ ఇంటర్వెల్ ఎపిసోడ్ అని టాక్ వినిపిస్తోంది.
రీసెంట్ టైమ్ లో చిరూని ఎవరైనా కలవాలంటే సెట్స్ కే వెళ్లి కలుస్తున్నారు. 54 అడుగుల హనుమంతుడి విగ్రహం ఫోటోలు నెట్టింట వైరలవుతున్న విషయం తెలిసిందే. ఈ విగ్రహం చుట్టూ కీలకమైన ట్రాక్ ను వశిష్ఠ ఎంతో పవర్‌ఫుల్ గా డిజైన్ చేశాడట. ఈ ఇంటర్వెల్ ఫైట్ లో ఆంజనేయుడికి, ఇంటర్వెల్ ఎపిసోడ్ కు చాలా స్ట్రాంగ్ కనెక్షన్ ఉంటుందట.
అప్పటివరకు సామాన్యుడిగా ఉన్న భీమవరం దొరబాబు ఒక్కసారిగా విశ్వరూపం దాల్చి దాడి చేసిన రౌడీ మూకల అంతు చూసే సీన్ లో ఫైట్లు నెక్ట్స్ లెవెల్ లో ఉండబోతున్నాయట. రానున్న సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజ్ కానున్న విశ్వంభర ఎలాంటి బ్రేక్స్ లేకుండా సూపర్ ఫాస్ట్ గా షూటింగ్ జరుపుకుంటోంది. ఆగస్ట్ లోపు సినిమాను పూర్తి చేసి ఆ తర్వాత 5 నెలలు పోస్ట్ ప్రొడక్షన్ కు కేటాయించాలని ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికి హనుమంతుడి బ్యాక్ డ్రాప్ లో సినిమా తీయాలన్న చిరూ కోరిక ఈ విధంగా అయినా కొంత తీరింది.