ట్యాలెంటెడ్ మలయాళ యాక్టర్ ఉన్ని ముకుందన్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ‘మార్కో’. హనీఫ్ అదేని దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని క్యూబ్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై షరీఫ్ ముహమ్మద్ నిర్మించారు. మలయాళంలో ఘన విజయం సాధించిన ఈ చిత్రాన్ని ఎన్వీఆర్ సినిమా తెలుగులో గ్రాండ్ గా రిలీజ్ చేసింది. జనవరి 1న ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ చిత్రం అందరినీ అలరించి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. తెలుగులో తొలి రోజు హయ్యస్ట్ వసూళ్లు సాధించిన మలయాళం మూవీగా నిలిచింది. ఈ సందర్భంగా హీరో ఉన్ని ముకుందన్ మార్కో విశేషాల్ని పంచుకున్నారు.
మార్కో తో బిగ్ సక్సెస్ అందుకున్నారు.. ఎలా అనిపిస్తోంది ?
-చాలా సంతోషంగా వుంది. సినిమాకు సపోర్ట్ చేసి ఘన విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఆడియన్స్ కి మంచి ఎంటర్ టైన్మెంట్ అందించడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను.
ప్రేక్షకుల రెస్పాన్స్ చూసినప్పుడు మీ రియాక్షన్ ఏమిటి ?
-వెరీ ఓవర్వెల్మింగ్ ఫీలింగ్. చాలా హార్డ్ వర్క్ చేశాం. ఫైట్ సీక్వెన్స్ ఎప్పుడూ రిస్క్ తో కూడుకున్నవే. నేను ఎలాంటి డూప్స్ ఉపయోగించలేదు. సినిమా A సర్టిఫికేట్ పొందినందున ప్రొడక్షన్ విషయంలో కూడా చాలా రిస్క్ ఉంది, కానీ ఇప్పుడు A సర్టిఫికేట్ పొందిన సినిమాతో 100cr క్రాస్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది.
షూటింగ్ సమయంలో ఈ స్థాయి విజయాన్ని ఊహించారా?
-ఊహించాను. యావత్ దేశం సినిమాను ఆదరిస్తారనే నమ్మకంతో ఉన్నాను. కాలం మారుతోంది. మా ప్రొడక్షన్ క్యాలిటీ అగ్రస్థానంలో ఉంది.
సినిమాలో మీ పాత్ర కోసంఎలా సిద్ధమయ్యారు?
-ఇది స్పిన్-ఆఫ్, కాబట్టి నాకు పాత్ర గురించి ఒక ఐడియా ఉంది. ఈ మూవీని టీమ్ చాలా ఉత్సాహంగా చేసింది. నా పెద్ద సపోర్ట్ నా బ్రదర్ షరీఫ్ ముహమ్మద్.
మీ పాత్ర కోసం ఎలాంటి సవాళ్లను ఎదుర్కొన్నారు?
-యాక్షన్ భాగాన్ని షూట్ చేస్తున్నప్పుడు నేను గాయపడకుండా చూసుకోవాలనుకున్నాను. అందరూ దాని కోసం ప్రార్థించారు. ఏదైనా గాయం అయితే షూట్ ఆగిపోతుంది. అదృష్టవశాత్తూ అన్నీ బాగానే జరిగాయి. క్యారెక్టర్ కోసం మంచి ఫిజిక్ ని రెడీ చేయాల్సి వచ్చింది. బిల్ట్‌ని మెయింటెయిన్ చేయడం ఛాలెంజింగ్ గా అనిపించింది.
ఇందులో మీకు మెమరబుల్ సీన్ ?
-స్టెయిర్ కేస్ ఫైట్.. అది బ్లాస్ట్ లా వచ్చింది. అందులో పార్ట్ అయిన అందరికీ నా అభినందనలు. ఇది బిగ్ స్క్రీన్స్ పై చూసే సినిమా. దయచేసి అందరూ థియేటర్స్ లో చూడండి నేనెందుకు ఇంత ఉత్సాహంగా చెబుతున్నానో మీకే మీకే అర్థమవుతుంది.
పర్శనల్ ఈ క్యారెక్టర్ మీకు రిలేట్ అవుతుందా ?
-స్క్రీన్ పై ఇప్పటివరకు చేసిన అన్ని పాత్రలకు నేను రిలేట్ అవుతాను.
ఈ సినిమా దర్శకుడు హనీఫ్ అదేని గురించి ?
-తను నా స్నేహితుడు సోదరుడు, శ్రేయోభిలాషి. తనతో వర్క్ చేయడం గ్రేట్ ఎక్స్ పీరియన్స్.
బీజీఎం విశేషమైన స్పందన లభించింది. రవి బస్రూర్ సంగీతానికి అందించిన సహకారం గురించి చెప్పండి?
-రవి బస్రూర్ మాస్టర్. ప్రతి సన్నివేశాన్ని ఆయన సంగీతంతో అద్భుతంగా తీర్చిదిద్దారు. తన టీమ్ మొత్తానికి అభినందనలు.
-నా హిట్ మూవీ జై గణేష్‌కి మేము పనిచేసిన చంద్రు డీవోపీగా అద్భుతమైన వర్క్ ఇచ్చారు. సునీల్ ఆర్ట్ వర్క్ తో ఆశ్చర్యపరిచారు. ఫైట్ మాస్టర్స్ అద్భుతంగా యాక్షన్ కొరియోగ్రఫీ చేశారు. అందరికీ పేరుపేరునా థాంక్ యూ.
మార్కో తెలుగులో మొదటి రోజు అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళ చిత్రంగా నిలిచింది. ఇంత గొప్ప మైలురాయిని సాధించడం ఎలా అనిపిస్తుంది?
-చాల థ్రిలింగ్ గా అనిపించింది. ఈ సినిమాను తెలుగులో విడుదల చేయాలని బలంగా అనుకున్నాను. తెలుగు ప్రేక్షకులు కొత్తదనంను ఆదరిస్తారు. బాహుబలి, ఈగ.. ఇలా రాజమౌళి సర్ తీసిన సినిమాలు హై టైమ్ ప్రయోగాలే అయినా ప్రేక్షకులు అద్భుతంగా ఆదరించారు. ఇలాంటి సినిమా తీయడానికి అదొక స్ఫూర్తి. తెలుగు ప్రేక్షకుల ప్రేమకు ధన్యవాదాలు.
తెలుగులో ఎన్‌విఆర్ సినిమా మార్కోని గ్రాండ్ రిలీజ్ చేయడం ఎలా అనిపించింది ?
-అద్భుతంగా రిలీజ్ చేశారు. ఇప్పుడు నేను మలయాళం నుండి భారీ ఓపెనింగ్స్ సాధించిన సినిమాతో నిలబడ్డాను. ఇంతకంటే ఏం కోరుకోను.
మీ కొత్త సినిమాలు? ఏ జోనర్ చేయడానికి ఎక్కువ ఇష్టపడతారు?
-నా నెక్స్ట్ ప్రాజెక్ట్ త్వరలోనే ఎనౌన్స్ చేస్తాను. ప్రేక్షకులు కొరుకునే అన్ని జోనర్స్ లో ఎంటర్ టైన్ చేయాలని వుంది.
ఆల్ ది బెస్ట్
-థాంక్ యూ