తెలంగాణ ప్రజలకు, దేశ ప్రజలకు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2023 సంవత్సరం ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖ సంతోషాలను నింపాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. అందరి ఆశయాలు, ఆకాంక్షలను నెరవేర్చే శుభ సంవత్సరంగా 2023 నిలవాలని ఆశాభావం వ్యక్తం చేశారు. పట్టు విడవకుండా భారత్ చేసిన ప్రయత్నాల వల్లే కొవిడ్ 19పై విజయం సాధించగలిగామని గవర్నర్ గుర్తు చేశారు. జీ20 సభ్యదేశాలకు నేతృత్వం వహించే స్థాయికి భారత్ ఎదిగిందన్నారు. రానున్న సంవత్సరంలో మరెన్నో విజయాలను భారత్ మూటకట్టుకోవాలని తమిళిసై ఆకాంక్షించారు.