ప్రతీకారం తీర్చుకున్న భారత జవాన్లు…. కశ్మీరీ పండిట్ ను కాల్చిన ఉగ్రవాది హతం

48 గంటల్లోనే భారత జవాన్లు ప్రతీకారం తీర్చుకున్నారు. పుల్వామాలో రెండు రోజుల క్రితం ఇస్లామిక్ ఉగ్రవాదులు కశ్మీరీ పండిట్ సంజయ్ శర్మను కాల్చి చంపారు. కశ్మీరీ పండిట్ సంజయ్ శర్మను కాల్చి చంపిన ఇస్లామిక్ ఉగ్రవాది అక్విబ్ ముస్తాక్ భట్ ను భద్రతా దళాలు కాల్చి చంపాయి. పుల్వామాలోని పడగంపోరా గ్రామంలో జరిగిన ఎన్ కౌంటర్ లో ఇస్లామిక్ ఉగ్రవాది అక్విబ్ ముస్తాక్ భట్ హతమయ్యాడని భద్రతా బలగాలు ప్రకటించాయి. అయితే… ముస్తాక్ భట్ మొదట్లో HM టెర్ర్ అవుట్ ఫిట్ కోసం పనిచేశాడు. అలాగే TRF అనే ఉగ్రవాద సంస్థతో కూడా పనిచేశాడు.

పౌరుల‌ను ల‌క్ష్యంగా చేసుకుని కాల్పులు జ‌రిపారు ఉగ్ర‌వాదులు. ఈ కాల్పుల్లో క‌శ్మీరీ పండిట్ మృతి చెందారు. ఈ ఘ‌ట‌న పుల్వామా జిల్లాలో జరిగింది. పుల్వామాలోని అచ్చన్‌ ప్రాంతానికి చెందిన కశ్మీరీ పండిట్‌ సంజయ్ శర్మ ఆదివారం స్థానిక మార్కెట్‌కు వెళ్తుండగా ఉగ్రవాదులు అతడిపై కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన ఆయనను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. పరిశీలించిన డాక్టర్లు అప్పటికే సంజయ్‌ శర్మ మరణించినట్లు చెప్పారు. ఉగ్రవాదుల కాల్పుల్లో చనిపోయిన మృతుడు సంజయ్‌ శర్మ స్థానిక బ్యాంకులో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నట్లు పోలీస్‌ అధికారి తెలిపారు. ఈ సంఘటన నేపథ్యంలో మైనార్టీలైన హిందువులున్న ఆ గ్రామంలో సాయుధ పోలీసులను మోహరించినట్లు చెప్పారు.

Related Posts

Latest News Updates