తెలుగు టెలివిజన్ &డిజిటల్ మీడియా మ్యూజిషియన్స్ యూనియన్ 4వ జనరల్ బాడీ సమావేశము

ప్రసాద్ ల్యాబ్ లో డిసెంబర్ 22వ తేదీ, 2024 నాడు తెలుగు టెలివిజన్ &డిజిటల్ మీడియా మ్యూజిషియన్స్ యూనియన్ ఆధ్వర్యంలో 4వ జనరల్ బాడీ సమావేశం విజయవంతంగా, వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ S A ఖుద్దూస్ నేత్రుత్వంలో జరిగింది. ఇందులో ఎజెండాగా సీనియర్ టెలివిజన్ మ్యూజిషియన్స్ కు ID కార్డుల వితరణ,, సత్కారం, మరియు మైక్రోకేర్ హాస్పిటల్ వారి ENT&నేత్ర ఐ ఇన్స్టిట్యూట్ వారి ఉచిత కంటి పరీక్ష శిబిరం ఎంతో సమర్ధవంతంగా నిర్వహింపబడ్డాయి.. సభలో ముందుగా వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ ఖుద్దూస్ తొలి పలుకులు పలికిన అనంతరం సుప్రసిద్ధ సినీ సంగీత దర్శకులు శ్రీ మాధవపెద్ది సురేష్, టీవీ ఫెడరేషన్ వ్యవస్థాపకులు శ్రీ నాగబాల సురేష్ కుమార్, KL గ్రూప్ CMD శ్రీ K లక్ష్మణ్, తెలుగు టెలివిజన్ ఫెడరేషన్ అధ్యక్షులు శ్రీ K రాకేష్, ప్రధాన కార్యదర్శి శ్రీ P విజయకుమార్, కోశాధికారి శ్రీ K నరేందర్ రెడ్డి మున్నగు ప్రముఖుల ద్వారా జ్యోతిప్రజ్వలన కార్యక్రమం యూనియన్ సభ్యుల ప్రార్ధనా గీతంతో సభాకార్యక్రమం ప్రారంభమైంది. సంగీత దర్శకులు శ్రీ మాధవపెద్ది సురేష్ మాట్లాడుతూ, యూనియన్ అనతికాలంలోనే ఎంతో ప్రగతి సాధించిందని, దానికోసం సమర్ధవంతంగా కృషి చేసిన శ్రీ ఖుద్దూస్ సేవ అద్భుతమని కొనియాడి, భవిష్యత్ లో యూనియన్ అభివృద్ధి కోసం బెనిఫిట్ షోల ద్వారా కొంత ఫండ్స్ సేకరించటంలో తన వంతు కృషి చేస్తానని సూచించారు. ఫెడరేషన్ PST లు తమదైన శైలిలో స్వల్పకాలంలోనే అసోసియేషన్ నుండి యూనియన్ గా మారి, అందరి మన్ననలు పొందిన శ్రీ ఖుద్దూస్ ను అభినందించారు. ఆ తర్వాత KL గ్రూప్ CMD శ్రీ K లక్ష్మణ్ మాట్లాడుతూ, “ఇంతింతై వటుడింతయై “అన్న రీతిలో పైకి ఎదిగిన యూనియన్ ప్రగతి కోసం అన్నివిధాలా ఆర్ధికంగా, హార్దికంగా తాను సహకరిస్తానని శ్రీ ఖుద్దూస్ కు సభాముఖంగా మాట ఇచ్చారు. శ్రీ నాగబాల సురేష్ గారు యూనియన్ ను ఇంత తక్కువ సమయంలో ఈ స్థాయికి తీసుకువచ్చిన శ్రీ ఖుద్దూస్ ను అభినందించారు. తదుపరి యూనియన్ అధ్యక్షులు శ్రీ ఖుద్దూస్ మాట్లాడుతూ ఈ 4వ జనరల్ బాడీ సమావేశంలో ఫెడరేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న అన్ని యూనియన్ ల PST లను ఆహ్వానించటం తనకు ఎంతో సంతోషకరంగా ఉన్నదని, తన సభ్యులకే కాక, సినీ మ్యూజిషియన్స్ యూనియన్ సభ్యులకు కూడా నేడు ఏర్పాటు చేసిన హెల్త్ క్యాంప్ మాదిరిగా మున్ముందు ప్రత్యేకంగా ENT మరియు Eye క్యాంపులు ఏర్పాటు చేయవలసినదిగా Dr శ్రీ ప్రకాష్ విన్నకోట గారిని, Dr శ్రీ రాం కుమార్ గూడపాటి గారిని కోరుతూ, లోగడ శ్రీ VVK విజయకుమార్ గారు శ్రీ.ఖుద్దూస్ గారికి వ్యక్తిగతంగా అందించిన 80గజాల స్థలాన్ని తెలుగు టెలివిజన్ &డిజిటల్ మీడియా మ్యూజిషియన్స్ యూనియన్ కు శ్రీ. ఖుద్దూస్ గారు విరాళంగా సమర్పిస్తూ, ఆ పాస్ బుక్ ను ప్రధాన కార్యదర్శికి అందజేశారు..పిదప ID కార్డుల వితరణ, ప్రముఖులు, సభ్యులకు చిరు సత్కారం జరిగిన పిమ్మట ప్రసిద్ధ సంగీత దర్శకులు శ్రీ సాలూరి వాసూరావు గారి సందేశం బైట్, KL స్టూడియో కి సంబంధించిన AV ప్రదర్శింపబడ్డాయి.. చివరిగా KL లక్ష్మణ్ గారి సౌజన్యంతో ఏర్పాటు చేయబడిన మిలేట్ భోజన కార్యక్రమం విందుతో సభాకార్యక్రమం అత్యద్భుతంగా ముగిసింది.. యూనియన్ అధ్యక్షులు శ్రీ ఖుద్దూస్, ప్రధాన కార్యదర్శి శ్రీ బంటి, కోశాధికారి శ్రీ ఉదయకుమార్ విచ్చేసిన ప్రముఖులందరికీ ధన్యవాదాలు తెలిపారు……

Related Posts

Latest News Updates