నేటి నుంచి నిర్మాతలు నిరాహార దీక్షలకు దిగుతున్నారు. గడువు ముగిసి 100 రోజులు గడిచినా.. కొత్త పాలక మండలి కోసం ఎన్నికలు జరగడం లేదని మండిపడుతున్నారు. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు జరగాలని పాలక మండలికి వినతి పత్రాలు సమర్పించినా… లాభం లేకుండా పోతోందని మండిపడుతున్నారు. సొసైటీ రాసుకున్న బైలా ప్రకారం ఎన్నికలను నిర్వహించాలని, కానీ నిర్వహించడం లేదని ఆరోపిస్తున్నారు. కావాలనే కొందరు కుట్రలు చేస్తున్నారని, చరిత్ర వున్న నిర్మాతల మండలిని నిర్వీర్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిర్మాతల మండలిని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నిస్తున్న వారి కుట్రలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని పలువురు పిలుపునిస్తున్నారు. ఈ నేపథ్యంలో నేటి నుంచి ఫిల్బ్ ఛాంబర్ దగ్గర నిరాహార దీక్షలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు.













