డైస్ ఆర్ట్ ఫిల్మ్స్ నిర్వహించిన తెలుగోడి బీట్ట్ సాంగ్ లాంచ్ – గ్రాండ్ సక్సెస్!

డైస్ ఆర్ట్ ఫిల్మ్స్ ఆధ్వర్యంలో ప్రముఖ గాయకుడు నోయెల్ తెలుగోడి బీట్ సాంగ్ లాంచ్ ఈవెంట్ విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, విద్యార్థులు పాల్గొని ఈ వేడుకను మరింత ప్రత్యేకంగా చేశారు. ఈ వేడుకలో నోయెల్ సాంగ్‌కు మంచి స్పందన వచ్చింది. డైస్ ఆర్ట్ ఫిల్మ్స్ తరఫున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. మీ ప్రేమ, ప్రోత్సాహం లేనిదే ఈ కార్యక్రమం సాధ్యం కాలేదు.

డైస్ ఆర్ట్ ఫిల్మ్స్ టీమ్ హర్షడైస్, మనస్వి రాజేష్ కన్నా మాట్లాడుతూ.. నిన్న జరిగిన నోయెల్ సాంగ్ ఈవెంట్ భారీ విజయాన్ని సాధించింది! దీన్ని మర్చిపోలేని విధంగా చేసినందుకు నా JNAFAU విద్యార్థులకు మరియు అతిథులకు ధన్యవాదాలు! నోయెల్ తన అద్భుతమైన ప్రదర్శనకు మరియు మాతో చేరినందుకు మా అతిథులకు ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కార్యక్రమం జరగడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అందరికీ ధన్యవాదాలు! ఈ ఈవెంట్‌ని హోస్ట్ చేసి అందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చే అవకాశం లభించినందుకు థ్రిల్‌గా ఉన్నాను. ఇది సంగీతం, నవ్వు మరియు జ్ఞాపకాలతో నిండిన రాత్రి, మేము ఎప్పటికీ ఆదరిస్తాము. మరోసారి, ఈ ఈవెంట్‌ను ఇంత ప్రత్యేకంగా చేసినందుకు మీలో ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు!

ఈ కార్యక్రమంలో రాహుల్ సిప్లిగంజ్, దేత్తడి హారిక, సిద్దు రెడ్డి కందకట్ల, మెహబూబా, ఇంద్రసేన తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మ్యూజిక్ డైరెక్టర్ నోయల్ మాట్లాడుతూ.. సాంగ్ చాలా బాగా వచ్చిందని, ఇంత బాగా రావడానికి కారణం అయినా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ పాటకు పని చేసిన డిఓపి భార్గవ్ అత్యద్భుతమైన విజువల్స్ అందించాలని, పాటలో స్టన్నింగ్ విజువల్స్ ఉన్నాయని పేర్కొన్నారు. అలాగే కొరియోగ్రాఫర్ సుభాష్ మాస్టర్ డాన్స్ చాలా బాగా కంపోజ్ చేశారని తెలిపారు. ఇక ఈవెంట్ కు రాహుల్ సీట్లు గంజ్ రావడం ఎంతో ప్రత్యేకమన్నారు. తన పాటలు మాత్రమే కాకుండా వేరే వాళ్ళ పాటల్లో యాక్ట్ చేశాను అంటే అది రాహుల్ సిప్లిగంజ్ పాటే అని గుర్తు చేసుకున్నారు. ఇక భవిష్యత్తులో కూడా రాహుల్ సిప్లిగంజ్ తో తప్ప ఏ ఒక్కరితో కొలాబరేట్ అవ్వను అన్నారు. ఈవెంట్ కు వచ్చిన మహబూబా, హారిక కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇక ఈ పాట అందరికీ నచ్చుతుందని డిసెంబర్ 31, సంక్రాంతి పండుగలకు దుమ్ము రేపుతుందని తెలిపారు.

రాహుల్ సిప్లిగంజ్ మాట్లాడుతూ.. తెలుగోడి బీట్ పాట లో ఫుల్ మాస్ బీట్ ఉందని ప్రేక్షకులు కచ్చితంగా ఈ పాటని ఘనవిజయం చేస్తారని.. ఈ పాట చేసిన నోయల్ కు అభినందనలు తెలిపారు. ఈ పాట ప్రతి ఒక్కరిని షేర్ చేయాలని, ఇలాంటి పాటలు మరెన్నో చేయాలని రాహుల్ సిప్లిగంజ్ పేర్కొన్నారు. అన్ని వేడుకల్లో దుమ్మురేపుతది అన్నారు.

సిద్దు రెడ్డి కందకట్ల మాట్లాడుతూ.. ఈ కార్యక్రమానికి వచ్చినా కళామతల్లి బిడ్డలకు, సరస్వతి పుత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నిజానికి ఆయనకు ఈ కళారంగానికి పెద్దగా పరిచయం లేదని ఈరోజు ఈ స్టేజి మీద మాట్లాడానికి కారణం మ్యూజిక్ డైరెక్టర్ సింగర్ నోయల్ అనే చెప్పారు. నోయల్ మాట్లాడుతుంటే వారి తల్లి కళ్ళల్లో నీళ్లు వచ్చాయని అవి ఆనందభాష్పాలు అని ఇలాంటి సందర్భం మనకు ఎంతో స్ఫూర్తినిస్తుందని తెలిపారు. తెలుగోడి బీట్ పాటతో నోయల్ కం బ్యాక్ చాలా గట్టిగా ఉంటుందని, పంచ్ ఎంత బలంగా కొట్టామని కాదు ఎంత బలమైన పంచును తీసుకోగలము అనేదే ముఖ్యం అని అప్పుడే మన సత్తా ఏంటో తెలుస్తుందని అన్నారు. నోయల్ కు ఆ సత్తా ఉందని చెప్పారు. ఈ పాట కచ్చితంగా తెలుగు ప్రజలను ఉర్రూతలుగుస్తుందని పేర్కొన్నారు.

హారిక మాట్లాడుతూ.. సాంగ్ ను అందరూ కచ్చితంగా సపోర్ట్ చేయాలని కోరారు. పాట మొదలు పెట్టినప్పటి నుంచి పూర్తి అయినంతవరకు నోయల్ ఎంత కష్టపడ్డారో దగ్గరుండి చూసానని, ఆయన కష్టానికి తగిన ఫలితం ఈ పాటలో ఉందని వెల్లడించారు. ఇక ఏ ఈవెంట్, ఫంక్షన్ జరిగినా కచ్చితంగా ఈ పాట మారుమోగుతుందని తెలిపారు.

మెహబూబా మాట్లాడుతూ.. ఈ సాంగ్ ను ఎన్నోసార్లు విన్నానని, ఎన్నిసార్లు విన్నా అసలు బోర్ రావడంలేదని తెలిపారు. ప్రేక్షకులు కచ్చితంగా ఈ పాటను మిలియన్స్ కు తీసుకెళ్తారని నమ్మకం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తెలుగోడి బీట్ పాట టీంకు శుభాకాంక్షలు తెలిపారు.

భరత్ మాట్లాడుతూ పాట చాలా బాగా వచ్చిందని ఇకపై జరిగే అన్ని ఈవెంట్స్ లలో ఈ పాట మోగుతుందని తెలిపారు. అలాగే నోయల్ నుంచి ఇలాంటి పాటలు సంవత్సరానికి 10, సినిమాలు ఓ పది రావాలని అన్నారు.

Related Posts

Latest News Updates