తెలంగాణ కాంగ్రెస్ నూతన రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ మాణిక్ రావు థాక్రే మొదటి సారిగా హైదరాబాద్ పర్యటనకు వచ్చారు. ఇంఛార్జి హోదాలో తొలిసారి హైదరాబాద్ కి వచ్చిన మాణిక్ థాక్రేకి తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, మల్లు విక్రమార్క, వీహెచ్ తో సహా పలువురు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రేవంత్ ఆయనకు శాలువా కప్పి, పూల బోకే అందించారు. ఇక… రెండు రోజుల పాటు మాణిక్ రావు ఠాక్రే హైదరాబాద్ లోనే వుండనున్నారు. పార్టీ పరిస్థితిని సమీక్షించనున్నారు. ఈ సందర్భంగా సీనియర్లు, జూనియర్లతో ఆయన భేటీ కానున్నారు.
Cordially welcomed our newly appointed AICC General Secretary Incharge for Telangana Shri.Manikrao Thakre ji at the Hyderabad airport today.
Looking forward to working together in this crucial year. @Manikrao_INC pic.twitter.com/IMlcoy351c
— Revanth Reddy (@revanth_anumula) January 11, 2023







