సీఎస్ సోమేశ్ కుమార్ ఏపీ కేడర్ కి వెళ్లిపోవాలని హైకోర్టు తీర్పుఇవ్వడం, దీని తర్వాత కేంద్రం ఆయన్ను రిలీవ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో తదుపరి సీఎస్ ను ఎంపిక చేయాల్సిన బాధ్యత తెలంగాణ ప్రభుత్వంపై పడింది. దీంతో కొత్త సీఎస్ ను నియమించడంపై ప్రభుత్వ వర్గాలు కసరత్తును ప్రారంభించాయి. ఇప్పటికే సీఎస్ సోమేశ్ కుమార్ సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు. కొత్త సీఎస్ రేసులో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, అటవీ శాఖ ప్రత్యేక సీఎస్ శాంతి కుమారి పేర్లు ప్రముఖంగా రేసులో వున్నాయి. అయితే… ఆర్థిక శాఖ స్పెషల్ సీఎస్ రామకృష్ణారావు పేరు ముందు వరుసలో వుంది. సీఎం కేసీఆర్ కూడా ఆయన వైపే మొగ్గుచూపుతున్నారు.

ఇక… వసుధా మిశ్రా, శశాంక్ గోయల్, సునీల్ శర్మ, రజత్ కుమార్, అశోక్ కుమార్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అయితే… ఈ నెల 12 వ తేదీ వరకూ సోమేశ్ కుమార్ కు గడువు వున్నందున… కొత్త సీఎస్ ను ఖరారు చేసిన తర్వాతే.. సీఎస్ సోమేశ్ ను ప్రభుత్వం రిలీవ్ చేయనుంది. సీనియారిటీ ప్రకారం సీఎస్ పదవికి వసుధా మిశ్రా (1987 బ్యాచ్), వై. శ్రీలక్ష్మి (ఏపీలో డెప్యూటేషన్), రాణి కుముదిని (1988), శాంతి కుమారి, అశోక్ కుమార్ (కేంద్ర సర్వీసులు), శశాంక్ గోయల్, సునీల్ శర్మ (1990), అర్వింద్ కుమార్, రజత్ కుమార్ సీఎస్ పదవికి అర్హుల జాబితాలో వున్నారు. అయితే.. సీనియారిటీతో సంబంధం లేకుండా తనకు నచ్చిన అధికారులను సీఎస్ గా నియమించుకొనే సంప్రదాయం నడుస్తూ వస్తోంది.