టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తెలంగాణ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. బీజేపీ అగ్రనేత బీఎల్ సంతోష్ ను తదుపరి ఉత్తర్వులు వచ్చేదాకా అరెస్ట్ చేయవద్దని హైకోర్టు ఆదేశించింది. అలాగే నోటీసులు ఇవ్వడానికి ఢిల్లీ పోలీసులు కూడా సహకరించాలని హైకోర్టు తెలిపింది. సిట్ పిటిషన్ పై విచారణను హైకోర్టు మంగళవారానికి వాయిదా వేసింది. ఇక బీఎల్ సంతోష్ తో పాటు అడ్వకేట్ శ్రీనివాస్ కు సిట్ నోటీసులిచ్చింది. దీనిపై స్టే ఇవ్వాలంటూ బీజేపీ హైకోర్టును ఆశ్రయించింది.

 

అదే సమయంలో సిట్ సైతం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సిట్ నోటీసులను రద్దు చేయలేమని హైకోర్టు స్పష్టం చేసింది. అసలు బీఎల్ సంతోశ్ కు, శ్రీనివాస్ కి ఇచ్చిన సీఆర్పీసీ నోటీసులు ఇచ్చిన విషయం మీడియాకు ఎలా లీక్ అయ్యిందని హైకోర్టు ప్రశ్నించింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ దర్యాప్తు పేరుతో ఇస్తున్న నోటీసులను నిలిపేయాలని బీజేపీ హైకోర్టులో మధ్యంతర పిటిషన్ వేసింది. బీజేపీ ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి ఈ పిటిషన్ దాఖలు చేశారు.