సింగరేణి ఉద్యోగులకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీపి కబురు అందించారు. దసరా పండుగ సందర్భంగా సింగరేణి కార్మికులకు 30 శాతం బోనస్ ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. 2021-22 ఏడాదికి గాను సంస్థ లాభాల నుంచి ఉద్యోగులకు 30 శాతం బోనస్ ఇవ్వాలని సీఎం నిర్ణయించారు. ఈ మేరకు సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగరావు ఉత్తర్వులు జారీ చేశారు. దీని ద్వారా అర్హులైన కార్మికులందరికీ సింగరేణి యాజమాన్యం 368 కోట్లను చెల్లించనుంది.