తెలంగాణలో జపనీస్ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థ DAIFUKU భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. హైదరాబాద్‌లోని చందనవెల్లిలో డైఫుకు ఇండియా మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది. రూ. 450 కోట్లతో యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది. సుమారు 800 మందికి పైగా ప్రత్యక్షంగా ఉపాధి కల్పించనుంది. ఈ మేరకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సమక్షంలో డైఫుకు ఇండియా ఒప్పందం కుదుర్చుకుంది. ఆటోమేటెడ్ స్టోరెజ్ సిస్టమ్స్, కన్వేయర్లు సహా ఆటోమేటిక్ స్టార్టర్స్ వంటి పరికరాలను ఈ సంస్థ తయారు చేస్తోంది.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. కరోనా తర్వాత పెద్ద ఎత్తున పెట్టుబడులు రావడం సంతోషంగా ఉందన్నారు. అనేక మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్లు హైదరాబాద్‌లో పెట్టుబడులు పెడుతున్నాయన్నారు. జపాన్ అద్భుతమైన టెక్నాలజీ ఉపయోగించుకొని ముందుకు వెళ్తుందన్నారు. దండు మైలారంలో అతిపెద్ద పారిశ్రామిక పార్కు తీసుకొచ్చామన్నారు.
In the presence of Industries Minister @KTRTRS, Telangana Govt. and Daifuku signed an MoU to set up a new manufacturing facility in the State. The world’s leading provider of automated material handling technology will invest ₹450 Cr and provide employment to over 800 people. pic.twitter.com/WMA5Hqd7o7
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) December 13, 2022







