తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గవర్నర్ తీరుపై ప్రభుత్వం వేసిన పిటిషన్ లో అనూహ్యం పరిణామం చోటుచేసుకుంది. గవర్నర్ పై వేసిన లంచ్ మోషన్ పిటిషన్ ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. రాజ్యాంగం ప్రకారమే వ్యవహరిస్తామని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది.  బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం ఉంటుందని ప్రభుత్వం తరపు న్యాయవాది దుష్యంత్ ధవే కోర్టుకు తెలిపారు. గవర్నర్ ప్రసంగంతోనే సమావేశాలు ప్రారంభమవుతాయన్నారు. గవర్నర్ ను విమర్శించొద్దని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. గవర్నర్ కూడా తన రాజ్యాంగ బద్ధమైన విధులు నిర్వహిస్తారని గవర్నర్ తరపు లాయర్ కోర్టుకు తెలిపారు.గవర్నర్ ప్రసంగంతోనే బడ్జెట్ ఉంటుందని టీఎస్ సర్కార్ తెలిపింది. తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ తేదీని మార్పు చేయనుంది. 3వతేదీకి బదులుగా 6వ తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశముంది.