సీబీఐ విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. కేంద్ర దర్యాప్తు సంస్థ రాష్ట్రంలో ఏ కేసులోనైనా దర్యాప్తు చేయాలంటే ఇకపై ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సిందే. దర్యాప్తు కోసం సీబీఐకి గతంలో ఇచ్చిన అనుమతిని ప్రభుత్వం వెనక్కి తీసుకున్నది. ఆగస్టు 30న తెలంగాణ హోంశాఖ ఉత్వర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోకి సీబీఐ రాకుండా జీవో 51ని జారీ చేసింది.