ఖమ్మం బీఆర్ఎస్ సభలో సీఎం కేసీఆర్, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు గవర్నర్ వ్యవస్థపై తీవ్ర విమర్శలు చేశారు. దీనిపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ సీరియస్ అయ్యారు. ముఖ్యమంత్రులు గవర్నర్ వ్యవస్థపై చేసిన వ్యాఖ్యలను ఖండించారు. సీఎం కేసీఆర్… ఇతర నేతలు గవర్నర్ వ్యవస్థను అవమానించారని మండిపడ్డారు. ముఖ్యమంత్రులుగా వుండి.. గవర్నర్ వ్యవస్థను ఎలా అవమానిస్తారని ప్రశ్నించారు. పలు మార్లు తాను ప్రొటోకాల్ పై మాట్లాడినా.. సీఎం కేసీఆర్ స్పందించలేదని మండిపడ్డారు. ఈ విషయంలో సీఎం కేసీఆర్ మాట్లాడిన తర్వాతే… ప్రభుత్వం అడిగే ప్రశ్నలకు సమాధానం చెబుతానని స్పష్టం చేశారు. గణతంత్ర దినోత్సవానికి ఇప్పటి వరకూ ప్రభుత్వం నుంచి ఆహ్వానం అందలేదని గవర్నర్ వెల్లడించారు.