తెలంగాణ డీజీపీగా నూతన బాధ్యతలు స్వీకరించిన అంజనీ కుమార్ ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. తనకు డీజీపీగా అవకాశం కల్పించినందుకు సీఎం కేసీఆర్‌కు డీజీపీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా అంజనీ కుమార్‌కు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ నూతన డీజీపీగా అంజనీ కుమార్ శనివారం మధ్యాహ్నాం బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి, సీపీలు సీవీ ఆనంద్, మహేశ్ భగవత్‌తో పాటు పలువురు పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
రాష్ట్ర డిజిపిగా బాధ్యతలను స్వీకరించిన అనంతరం ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావును ఈరోజు ప్రగతి భవన్ లో శ్రీ అంజనీ కుమార్ మర్యాదపూర్వకంగా కలిసారు. తనకు డిజిపిగా అవకాశం కల్పించినందుకు సీఎంకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా డిజిపి అంజనీ కుమార్ కు సీఎం శుభాకాంక్షలు తెలిపారు. pic.twitter.com/x1uYwZA3ab
— Telangana CMO (@TelanganaCMO) December 31, 2022