తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో కొత్తగా మరో 13 మండలాలను ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. గతంలోనే వీటికి సంబంధించిన ప్రాథమిక నోటిఫికేషన్ జారీ అయిన విషయం తెలిసిందే. తాజాగా ప్రజల నుంచి అభ్యంతరాలు, వినతులను స్వీకరించిన అనంతరం తెలంగాణ జిల్లాల ఏర్పాటు చట్టం ప్రకారం కొత్త మండలాలను ఏర్పాటు చేస్తున్నట్లు సీఎస్ సోమేశ్ కుమార్ ప్రకటించారు.
జిల్లాల వారీగా కొత్త మండలాలు
జగిత్యాల – ఎండపల్లి, భీమారం
నల్గొండ – గట్టుప్పల్
సంగారెడ్డి జిల్లా – నిజాంపేట
మహబూబాబాద్ – సీరోలు, ఇనుగుర్తి
సిద్దిపేట- అక్బర్ పేట-భూంపల్లి, కుకునూరు పల్లి
కామారెడ్డి జిల్లా- డొంగ్లి
నిజామాబాద్- ఆలూర్, డొంకేశ్వర్, సాలూరా
మహబూబ్ నగర్- కౌకుంట్ల