ఢిల్లీ వేదికగా భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కార్యాలయం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు బీఆర్ఎస్ కార్యాలయాన్ని ఢిల్లీలో ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయ ఆవరణలో జెండాను ఎగరేశారు. తర్వాత బీఆర్ఎస్ అధ్యక్ష స్థానంలో కూర్చొని, పేపర్లపై సంతకాలు చేసి, బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జేడీఎస్ అధ్యక్షుడు కుమార స్వామి, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్, రైతు సంఘాల నేతలు, రాష్ట్ర మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు.

పార్టీ కార్యాలయం కంటే ముందు కార్యాలయం ఆవరణలో రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న రాజశ్యామల యాగ పూర్ణాహుతికి సీఎం కేసీఆర్, సతీమణి శోభ, కూతురు, ఎమ్మెల్సీ కవిత, ఇతర కుటుంబీకులు హాజరయ్యారు. ఈ సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి కేసీఆర్ దంప‌తుల‌కు వేద పండితులు ఆశీర్వ‌చ‌నాలు అందించారు. ఈ సందర్భంగా కాసేపు అందరి నేతలతో సీఎం కేసీఆర్ ముచ్చటించారు.