నేడు తెలంగాణ బీజేపీ బూత్ కమిటీ సమ్మేళనాన్ని నిర్వహించనుంది. రాష్ట్ర వ్యాప్తంగా వున్న 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బూత్ కమిటీ సమ్మేళనాలు జరగనున్నాయి. దీంతో 34,600 బూత్ కమిటీలకు చెందిన 7,26 లక్షల మంది కార్యకర్తలు పాల్గొంటారని బీజేపీ ప్రకటించింది. ఈ బూత్ సమ్మేళనాన్ని ఉద్దేశించి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వర్చువల్ గా ప్రసంగిస్తారు. ఉదయం 10 గంటలకు సభ్యుల రిజిస్ట్రేషన్ తో ఈ కార్యక్రమం లాంఛ్ అవుతుంది. ఇక.. ఉదయం 10 గంటలకే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బూత్ కమిటీ సభ్యులను ఉద్దేశించి ప్రసంగిస్తారు.
63591 19119 అనే నంబర్ కు మిస్డ్ కాల్ ఇవ్వడంతో ఈ సమ్మేళనంలో భాగస్వాములవుతారు. మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల దాకా నడ్డా మాట్లాడుతారు. ఈ సమ్మేళనంలోనే ‘సరళ్’ యాప్ ను నడ్డా ప్రారంభిస్తారు. ప్రతీ నియోజకవర్గంలో జరుగనున్న సమ్మేళనంలో బూత్ కమిటీ సభ్యులు, శక్తి కేంద్రాల ఇన్చార్జ్లు, మండలాధ్యక్షులతో పాటు నియోజకవర్గ కన్వీనర్, ప్రభారీ, విస్తారక్, పాలక్ లు పాల్గొంటారు. ఈ సమ్మేళనం నేపథ్యంలో ప్రతి బూత్ లో బీజేపీ ఎల్ఈడీ స్క్రీన్లను కూడా ఏర్పాటు చేసింది. ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా… టెక్నికల్ టీమ్ ను కూడా ఏర్పాటు చేసుకోవడం విశేషం.