దసరా సెలవుల్లో ఎలాంటి మార్పూ లేదని తెలంగాణ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. సెలవులు కుదింపుపై వస్తున్న వార్తలను తెలంగాణ విద్యాశాఖ ఖండించింది. అందులో ఎలాంటి వాస్తవమూ లేదని తేల్చి చెప్పింది. ముందుగా ప్రకటించినట్లు గానే ఈ నెల 26 నుంచి వచ్చే నెల 9 వరకూ దసరా సెలవులు వుంటాయని పేర్కొంది. అక్టోబర్ 10 న పాఠశాలలు పున: ప్రారంభమవుతాయని తెలిపింది.
ఇప్పటికే విద్యార్థులకు సెలవులు ఎక్కువగా వచ్చాయని, దసరా సెలవులను కుదించాలంటూ ఎస్సీఈఆర్ టీ) రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. పాఠశాల విద్యాశాఖకు ఓ లేఖ రాశారు. జూలైలో కురిసిన వర్షాల కారణంగా 5 రోజుల సెలవులు వచ్చాయని, మళ్లీ జాతీయ సమైక్యతా దినోత్సవం రోజు సెలవు వచ్చిందని… పేర్కొంది.