2023-24 ఆర్థిక సంవత్స‌రానికి సంబంధించిన బ‌డ్జెట్‌ను ఆర్థిక మంత్రి హ‌రీశ్‌రావు శాస‌న‌స‌భ‌లో ప్ర‌వేశ‌పెట్టారు. హ‌రీశ్‌రావు బ‌డ్జెట్ ప్ర‌సంగం 1 గంట 44 నిమిషాల పాటు కొన‌సాగింది. ఉద‌యం 10:30 గంట‌ల‌కు ప్రారంభ‌మైన బ‌డ్జెట్ ప్ర‌సంగం.. మ‌ధ్యాహ్నం 12:14 గంట‌ల వ‌ర‌కు కొన‌సాగింది. ముఖ్య‌మంత్రి కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ రాష్ట్రం ఎనిమిదిన్నరేండ్ల స్వల్పకాలంలోనే అత్యంత ప్రగతిశీల రాష్ట్రంగా రూపుదిద్దుకున్నది. ప్రజాసంక్షేమంలోనూ అభివృద్ధిలోనూ యావత్ దేశానికి ఆదర్శప్రాయంగా నిలిచింది. తెలంగాణ ఆచరిస్తుంది దేశం అనుసరిస్తుంది అని చెప్పుకునే స్థాయికి చేరుకున్నదని హరీశ్ రావు పేర్కొన్నారు. రానున్న రోజుల్లోనూ జాతి నిర్మాణంలో తెలంగాణ మ‌రింత ఉజ్వ‌ల పాత్ర‌ను నిర్వ‌హించే విధంగా పురోగమిస్తుంది.. ద‌ళితులు, గిరిజ‌నులు, మైనార్టీలు, బ‌డుగు, బ‌ల‌హీన వ‌ర్గాల ప్ర‌జ‌లు, అగ్ర‌వ‌ర్ణ పేద‌లు అంద‌రి జీవితాల్లో సంపూర్ణ‌మైన వికాసాన్ని సాధించేంత వ‌ర‌కు విశ్రాంతి, విరామం ఎరుగ‌క ప‌రిశ్ర‌మిస్తూనే ఉందామని పిలుపునిచ్చారు.

2023-2024 ఆర్థిక సంవత్సరానికి మంత్రి హరీశ్ ప్రవేశపెట్టిన బడ్జెట్ పూర్తి స్థాయి వివరాలు… ఏ రంగానికి ఎంత కేటాయించారనేది పూర్తి స్థాయిలో వివరాలు…

మొత్తం బడ్జెట్‌ – రూ. 2,90,396
రెవెన్యూ వ్య‌యం – రూ. 2,11,685
పెట్టుబ‌డి వ్య‌యం – రూ. 37,525

నీటి పారుద‌ల రంగం రూ. 26,885 కోట్లు
వ్య‌వ‌సాయ రంగానికి రూ. 26,831 కోట్లు
విద్యుత్ రంగానికి రూ. 12,727 కోట్లు
హోంశాఖ‌కు రూ. 9,599 కోట్లు

ఆర్థిక శాఖ‌కు రూ. 49,749 కోట్లు

విద్యాశాఖ‌కు రూ. 19,093 కోట్లు
వైద్య రంగానికి రూ. 12,161 కోట్లు
ఆరోగ్య శ్రీ ప‌థ‌కానికి రూ. 1463 కోట్లు..
ప‌రిశ్ర‌మ‌ల శాఖ‌కు రూ. 4,037 కోట్లు
రోడ్లు భ‌వ‌నాల శాఖ‌కు రూ. 2,500 కోట్లు

రుణ‌మాఫీ ప‌థ‌కానికి రూ. 6,385 కోట్లు..
రైతుబందు ప‌థ‌కానికి రూ. 15,075 కోట్లు
రైతుబీమా ప‌థ‌కానికి రూ. 1589 కోట్లు

కేసీఆర్ న్యూట్రిష‌న్ కిట్ ప‌థ‌కానికి రూ. 200 కోట్లు
ఆస‌రా పెన్ష‌న్ల కోసం రూ. 12 వేల కోట్లు
క‌ళ్యాణ‌ల‌క్ష్మి, షాదీ ముబార‌క్ కోసం రూ. 3,210 కోట్లు
ద‌ళిత‌బంధు కోసం రూ. 17,700 కోట్లు
బీసీ సంక్షేమం కోసం రూ. 6,229 కోట్లు
మ‌హిళా, శిశు సంక్షేమం కోసం రూ. 2,131 కోట్లు.
ఎస్సీ ప్ర‌త్యేక నిధి కోసం రూ. 36,750 కోట్లు
మైనార్టీ సంక్షేమం కోసం రూ. 2,200 కోట్లు
గిరిజ‌న సంక్షేమం, ప్ర‌త్యేక ప్ర‌గ‌తి నిధికి రూ. 15,223 కోట్లు
మైనార్టీ సంక్షేమం కోసం రూ. 2,200 కోట్లు

ఆయిల్ పామ్‌కు రూ. 1000 కోట్లు
అట‌వీ శాఖ కోసం రూ. 1,471 కోట్లు
హ‌రిత‌హారం ప‌థ‌కానికి రూ. 1471 కోట్లు

ప‌ల్లె, ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తి కార్య‌క్ర‌మానికి రూ. 4,834 కోట్లు
డ‌బుల్ బెడ్రూం ఇండ్ల ప‌థ‌కానికి రూ. 12,000 కోట్లు