ఘనంగా “ఉల్లాసంగానే ఉత్సాహంగానే” సినిమా టీజర్ లాంఛ్

లోకేష్ బాబు దాసరి, శిరీష నులు హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ఉల్లాసంగానే ఉత్సాహంగానే. ఈ సినిమాను శ్రీ మైత్రీ క్రియేషన్స్ పతాకంపై యార్లగడ్డ ఉమామహేశ్వరరావు నిర్మిస్తున్నారు. కేవీజీ రాజు దర్శకత్వం వహిస్తున్నారు. ఎండీ కలామ్, ఖదీర్ కో ప్రొడ్యూసర్స్ గా వ్యవహరిస్తున్నారు. ఉల్లాసంగానే ఉత్సాహంగానే సినిమా టీజర్ లాంఛ్ కార్యక్రమం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమంలో

నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ – ఏ సినిమాకైనా మంచి ప్రమోషన్ చేయాలంటే పీఆర్ఓ బాగా పనిచేయాలి. ఈ సినిమాకు నివాస్ బాగా ప్రమోషన్ చేస్తున్నారు. కొత్త ప్రొడ్యూసర్ ఇండస్ట్రీకి వస్తే ప్యాషనేట్ గా సినిమాలు నిర్మిస్తారు. ఉల్లాసంగానే ఉత్సాహంగానే టైటిల్ ఫ్రెష్ గా ఉంది. టీజర్ ఆకట్టుకుంది. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా. అన్నారు.

నటుడు జబర్దస్త్ ప్రవీణ్ మాట్లాడుతూ- ఉల్లాసంగానే ఉత్సాహంగానే సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ రాజు గారికి, ప్రొడ్యూసర్స్ కు థ్యాంక్స్. మా జబర్దస్త్ నుంచి వచ్చిన ఎంతోమంది హీరోలు, మంచి ఆర్టిస్టులు అయ్యారు. అలా నాకు కూడా ఈ చిత్రంతో మంచి పేరు దక్కుతుందని ఆశిస్తున్నా. అన్నారు.

హీరో లోకేష్ బాబు మాట్లాడుతూ – ఉల్లాసంగానే ఉత్సాహంగానే సినిమాలో హీరోగా నటించే అవకాశం ఇచ్చిన మా రాజు గారికి థ్యాంక్స్. అలాగే మా ప్రొడ్యూసర్స్ కు కూడా కృతజ్ఞతలు చెబుతున్నా. సినిమా కోసం మా రాజు గారు, ప్రొడ్యూసర్స్ ఎంత కష్టపడ్డారో దగ్గరగా చూశాను. ఇదొక మంచి లవ్ స్టోరీ. ఫీల్ గుడ్ గా ఉంటూ అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఆకట్టుకుంటుంది. ఈ సినిమా మా టీమ్ కు మంచి సక్సెస్ ఇస్తుందని ఆశిస్తున్నా. అన్నారు.

దర్శకుడు కేవీజీ రాజు మాట్లాడుతూ – దేవుడు మనకు డైరెక్ట్ గా సాయం చేయకుండా మరో మనిషి ద్వారా సాయం చేస్తుంటాడు. అలా నాకు మా ప్రొడ్యూసర్స్ రూపంలో వచ్చి సాయం చేశాడు. ఈ చిత్రంలో లోకేష్ ఎనర్జిటిక్ గా నటించాడు. ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి పర్ ఫార్మెన్స్ చేశాడు. ఈ మధ్య మన హీరోలు లవ్ స్టోరీస్ తగ్గించారు. లోకేష్ మంచి లవ్ స్టోరీస్ చేస్తే పేరు తెచ్చుకుంటాడు. మా ఉల్లాసంగానే ఉత్సాహంగానే మూవీ టీజర్ చూశారు. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాం. మా సినిమాలో మచ్చరవి గారు హీరో ఫాదర్ రోల్ చేశారు. అలాగే నాగమహేశ్ గారు హీరోయిన్ ఫాదర్ రోల్ చేశారు. మా హీరోయిన్ శిరీష మరో మూవీలో బిజీగా ఉండి రాలేకపోయింది. త్వరలో సాంగ్స్, ట్రైలర్ కూడా రిలీజ్ చేస్తాం. మీ అందరి సపోర్ట్ ఉంటుందని కోరుకుంటున్నా. అన్నారు.

ప్రొడ్యూసర్ ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ – ఉల్లాసంగానే ఉత్సాహంగానే టీజర్ ఎలా ఉంది. మీ అందరికీ నచ్చిందని భావిస్తున్నా. సినిమా కూడా అంతకంటే బాగుంటుంది. ఒక మంచి లవ్ స్టోరీని ఈ చిత్రంలో తెరకెక్కించారు మా డైరెక్టర్ రాజు గారు. ఈ చిత్రంతో ఆయన దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నా. అన్నారు.

కో ప్రొడ్యూసర్ ఎండీ కలామ్ మాట్లాడుతూ – మా ఉల్లాసంగానే ఉత్సాహంగానే సినిమా టీజర్ లాంఛ్ కు వచ్చిన పెద్దలు రామసత్యనారాయణ గారికి థ్యాంక్స్. టీజర్ ఎంత బాగుందో మూవీ అంతకంటే బాగుంటుంది. త్వరలోనే చిత్రాన్ని మీ ముందుకు తీసుకొస్తాం. అన్నారు.

కో ప్రొడ్యూసర్ ఖదీర్ మాట్లాడుతూ – ఉల్లాసంగానే ఉత్సాహంగానే సినిమా టైటిల్ లాగే మూవీ కూడా చాలా బాగుంటుంది. టీజర్ ఆకట్టుకుందని ఇక్కడికి వచ్చిన వారు చెప్పడం హ్యాపీగా ఉంది. మీడియా మిత్రులు మా మూవీకి మరింతగా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా. అన్నారు.

నటీనటులు – లోకేష్ బాబు దాసరి, శిరీష నులు, నాగమహేశ్, బీవీఎస్ రవి, జబర్దస్త్ ప్రవీణ్, తదితరులు

టెక్నికల్ టీమ్

సినిమాటోగ్రఫీ – ధర్మ
మ్యూజిక్ – అజయ్ పట్నాయక్
కో ప్రొడ్యూసర్స్ – ఎండీ కలామ్, ఖదీర్
నిర్మాత – యార్లగడ్డ ఉమామహేశ్వరరావు
పీఆర్ఓ – లక్ష్మీ నివాస్
రచన, దర్శకత్వం – కేవీజీ రాజు

Related Posts

Latest News Updates

దిల్ రాజు ప్రెజెంట్స్, విక్టరీ వెంకటేష్, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్, అనిల్ రావిపూడి, శిరీష్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ‘సంక్రాంతికి వస్తున్నాం’- ఆర్‌ఎఫ్‌సీలో సంక్రాంతి స్పెషల్ సాంగ్ షూటింగ్