మాచర్లలో టెన్షన్… టెన్షన్… టీడీపీ, వైసీపీ మధ్య తీవ్ర ఘర్షణలు

మాచర్లలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. ఇది చిలికి చిలికి గాలి వానలా మారిపోయింది. ఇరు వర్గాల ఘర్షణలో పలు వాహనాలు కూడా అగ్ని ఆహుతైపోయాయి. టీడీపీ నేత జూలకంటి బ్రహ్మారెడ్డి అనుచరుల ఇళ్లపై వైసీపీ కార్యకర్తలు దాడి చేసి, తీవ్రంగా కొట్టారు. ఆయన అపార్టుమెంట్లలోని 8 కార్లను విధ్వంసం చేశారు. ఇందులో 3 కార్లు టీడీపీ నేతలవి కాగా, మరో 4 అపార్ట్ మెంట్ వాసులకు చెందినవి. శుక్రవారం సాయంత్రం ఇరు పక్షాల నేతలు కొట్టుకున్నారు. కర్రలతో దాడులకు కూడా దిగి… నానా రచ్చ రచ్చ చేశారు.

టీడీపీ ఆధ్వర్యంలో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమాన్ని తలపెట్టారు. దీనికి టీడీపీ నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. అయితే.. ఈ కార్యక్రమానికి వస్తున్న టీడీపీ నేతలను వైసీపీ నేతలు అడ్డుకున్నారు. ఇటు వైపు రావొద్దంటూ హెచ్చరికలు జారీ చేశారు. వైసీపీ నేతలు రాళ్లు, కర్రలు, ఆయుధాలతో టీడీపీ నేతలపై దాడులకు దిగారు. పల్నాడు జిల్లా మాచర్లలో శుక్రవారం జరిగిన గొడవలకు ఫ్యాక్షన్‌ మూలాలే కారణమని పల్నాడు జిల్లా ఎస్పీ వై రవిశంకర్‌రెడ్డి తెలిపారు. మాచర్లలో నిర్వహించిన కార్డన్‌ సెర్చ్‌లో ఎలాంటి మారణాయుధాలు దొరకలేదు. వ్యక్తులను మాత్రం గుర్తించాం. టీడీపీ నిర్వహించే ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమంలో కొందరు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయటంతో గొడవ మొదలైంది. గుర్తుతెలియని వ్యక్తులు రాళ్ల దాడి చేయటంతో గొడవ ముదిరింది. ఒకరిపై ఒకరు ప్రతిదాడి చేస్తున్నారు. ఈ గొడవలకు ఫ్యాక్షన్‌ గొడవలే తప్ప ఎలాంటి రాజకీయ కోణం లేదని ఎస్పీ తెలిపారు.

Related Posts

Latest News Updates