మాజీ మంత్రి నారాయణ బెయిల్ రద్దు… నవంబర్ 30 లోపే లొంగిపోవాలని కోర్టు ఆదేశాలు

టీడీపీ నేత, మాజీ మంత్రి పొంగులేటి నారాయణ బెయిల్ రద్దైంది. పదో తరగతి ప్రశ్నా పత్రాల లీకేజీ కేసులో ఈ బెయిల్ రద్దైంది. బెయిల్ ను రద్దు చేస్తూ చిత్తూరు తొమ్మిదో అదనపు కోర్టు తీర్పునిచ్చింది. నవంబర్ 30 లోపే పోలీసుల ఎదుట లొంగిపోవాలని కోర్టు ఆదేశించింది. పదో తరగతి ప్రశ్నాపత్రాలు లీకేజీ కేసులో మాజీమంత్రి నారాయణపై చిత్తూరు పోలీసులు కేసు నమోదు చేసి ఈ ఏడాది ఏప్రిల్‌లో అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. అయితే న్యాయస్థానం అయనకు బెయిల్ మంజూరు చేసింది. దీంతో కింది కోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను రద్దు చేయాలని ప్రభుత్వం తరఫు న్యాయవాది చిత్తూరు కోర్టులో మరో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం నారాయణ బెయిల్ రద్దు చేస్తూ నవంబర్ 30వ తేదీ లోపల పోలీసుల ఎదుట లొంగిపోవాలని ఆదేశాలు జారీ చేసింది.

Related Posts

Latest News Updates