నెల్లూరు జిల్లా కందుకూరులో జరిగిన చంద్రబాబు సభలో మరణించిన టీడీపీ కార్యకర్తల కుటుంబాలకు పార్టీ 23 లక్షల నష్ట పరిహారం ప్రకటించింది. మొదట 10 లక్షల చొప్పున ఆర్థిక సాయం అని ప్రకటించినా… ఆ తర్వాత చంద్రబాబు నిర్ణయాన్ని మార్చుకున్నారు. కందుకూరులో విషాద ఘటన జరిగిన నేపథ్యంలో చంద్రబాబు టీడీపీ సీనియర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్ తర్వాతే 23 లక్షల చొప్పున పరిహారం అందజేయాలని నిర్ణయించారు.
మరోవైపు తొక్కిసలాటలో మరణించిన వారి కుటుంబాలను చంద్రబాబు పరామర్శించారు. ఓగూరులో టీడీపీ కార్యకర్త గడ్డం మధు మృత దేహానికి చంద్రబాబు నివాళులు అర్పించారు. వారి కుటుంబాన్ని చంద్రబాబు ఓదార్చారు. బాధిత కుటుంబాలకు టీడీపీ అండగా వుంటుందని ప్రకటించారు. మధు కుటుంబానికి తక్షణ సాయం కింద 10 లక్షల చెక్కుతో పాటు 1.50 లక్షల నగదును అందజేశారు. మిగిలిన మొత్తాన్ని త్వరలోనే పార్టీ నేతలు అందిస్తారని చంద్రబాబు ప్రకటించారు.