నడి రోడ్డుపైనే ధర్నాకు దిగిన చంద్రబాబు… గుడుపల్లిలో టెన్షన్.. టెన్షన్…

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గం కుప్పంలో మూడో రోజు పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం, పోలీసుల ఆంక్షలు, టీడీపీ ప్రచార వాహనాన్ని పోలీసులు తిరిగి ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ గుడుపల్లిలో రోడ్డుపై బైఠాయించారు. ధర్నాకు దిగారు. తమ పార్టీ ప్రచార రథాన్ని తిరిగి తమకు వెంటనే అప్పగించాలని డిమాండ్ చేశారు. టీడీపీ కార్యాలయంలో తమ సమావేశం జరగకుండా అడ్డుకుంటున్నారని, ప్రజాస్వామ్యంలో ఇలాంటి అరాచకాలకు స్థానం లేదని పోలీసులపై తీవ్రంగా మండిపడ్డారు. తమ కార్యకర్తలు సమావేశానికి రాకుండా బారికేడ్లు పెడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

ఇష్ఠానుసారంగా ప్రవర్తిస్తే మాత్రం తాము ఊరుకోమని, వైసీపీ వారికి ఓ రూలు, తమకి ఓ రూలా? అంటూ ప్రశ్నించారు. నా నియోజకవర్గంలో నన్నే పర్యటించనివ్వరా? నా ప్రజలను కూడా కలిసే హక్కు లేదా? ఏపీలో సైకో పాలన సాగుతోంది అంటూ చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కుప్పం ప్రజలది పసుపు రక్తమని, వారి గుండెల్లో సైకిల్ వుంటుందని చంద్రబాబు అన్నారు. పోలీసుల పేర్లన్నీ తాను కచ్చితంగా గుర్తు పెట్టుకుంటానని, వారికి పనిష్మెంట్ వుంటుందని తీవ్రంగా హెచ్చరించారు. తన సభలకు జనాలు స్వచ్ఛందంగానే వస్తున్నారని, తాను రాష్ట్రంలో పర్యటిస్తే.. ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తుందన్న భయంతోనే లేనిపోని ఆంక్షలు విధిస్తున్నారని చంద్రబాబు అన్నారు.

Related Posts

Latest News Updates