మండలినే రద్దు చేయాలన్న సీఎం జగన్… ఇప్పుడు ఓట్లు అడుగుతారా? చంద్రబాబు

శాసన మండలి వ్యవస్థనే అగౌరవ పరిచిన ముఖ్యమంత్రి జగన్.. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ అభ్యర్థులను నిలబెట్టారని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సూటిగా ప్రశ్నించారు. అప్పుడు అలా మాట్లాడిన సీఎం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారని నిలదీశారు. గతంలో శాసన మండలి రద్దు చేయాలని సీఎం జగన్ అసెంబ్లీలో తీర్మానం చేశారని, ఇప్పుడు మాత్రం ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు అడుగుతారా? అని మండిపడ్డారు. తన మాట నెగ్గలేదన్న అహంకారంతోనే నాడు సీఎం మండలి రద్దుకు తీర్మానం చేశారని విమర్శించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై టీడీపీ నేతలతో చంద్రబాబు సమావేశమయ్యారు. టీడీపీ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు పార్టీ ఇన్‌చార్జ్లు, నేతల పనితీరుకు పరీక్ష అని పేర్కొన్నారు.

 

రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వుందని, అది పార్టీకి అనుకూలంగా మలుచుకోవాలని చంద్రబాబు నాయుడు సూచించారు. పాలనలో అన్ని విధాలుగా విఫలమైన సీఎం జగన్ తీవ్ర అసహనంతో వున్నారని, అందులో భాగంగానే తమ పర్యటనలు, సభలపై ఆంక్షలు పెడుతున్నారని విరుచుకుపడ్డారు. కరుడుగట్టిన ఉగ్రవాదిలా సీఎం ప్రవర్తిస్తున్నారని, కొందరు పోలీసులు మాత్రం బాధ్యతలు మరిచి, ఊడిగం చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు.

 

రలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన అభ్యర్థులను వైసీపీ ప్రకటించింది. స్థానిక సంస్థల కోటా నుంచి 9 స్థానాలు, ఎమ్మెల్యే కోటా నుంచి 7 స్థానాలకు, గవర్నర్ కోటా నుంచి 2 స్థానాలకు అభ్యర్థులను వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి మరోసారి సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తూ, బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు స్థానం కల్పించారన్నారు. సామాజిక న్యాయానికి వైసీపీ కట్టుబడి వుందన్నారు.

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థులు

నర్తు రామారావు… శ్రీకాకుళం,
కుడిపూడి సూర్యనారాయణ, తూర్పుగోదావరి
వంకా రవీంద్రనాథ్ (పశ్చిమ గోదావరి)
కవురు శ్రీనివాస్ (పశ్చిమ గోదావరి)
మేరుగు మురళీధర్ (నెల్లూరు)
సిపాయి సుబ్రహ్మణ్యం (చిత్తూరు)
పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి (కడప)
ఎ. మధుసూదన్ (కర్నూలు)
ఎస్. మంగమ్మ (అనంతపురం)

ఎమ్మెల్యే కోటా కింద…

పెన్మత్స సూర్యనారాయణ రాజు (విజయనగరం)
పోతుల సునీత (బాపట్ల)
కోలా గురువులు (విశాఖ)
బొమ్మి ఇజ్రాయిల్ (బీఆర్ అంబేద్కర్ కోనసీమ)
జయమంగళ వెంకటరమణ (ఏలూరు)
చంద్రగిరి ఏసురత్నం (గుంటూరు)
మర్రి రాజశేఖర్ (పల్నాడు)

గవర్నర్ కోటా కింద…

కుంభా రవిబాబు (అల్లూరి సీతారామ రాజు)
కర్రి పద్మశ్రీ (కాకినాడ)

Related Posts

Latest News Updates