“క్రావెన్ గా మారడం గురించి చెప్పిన టేలర్ జాన్సన్”

వరల్డ్ లోనే మోస్ట్ హ్యాండ్సం మ్యాన్ అయిన టేలర్ జాన్సన్ తన ఫ్యాన్స్ తో మాట్లాడుతూ, తను క్రావెన్ ది హంటర్ అనే సినిమా కోసం, తనను తాను ఎలా మార్చుకున్నాడో వివరంగా చెప్పాడు.

అక్కడ ఉన్న మోస్ట్ ఫ్యామస్ యాక్టర్స్ అందరి లోకీ, టేలర్ జాన్సన్ ఒకడు అని నిస్సందేహంగా చెప్పొచ్చు. అలానే అతను క్రావెన్ అనే రోల్ కోసం ఫిజికల్ గా ఎలా ట్రాన్స్ఫార్మ్ అయ్యాడో చూస్తే, అతని ఫిట్నెస్ లెవెల్ ఏ రేంజ్ లో ఉందో ఎవ్వరికైనా అర్థం అవుతుంది.

2024 లో ప్రస్తుతం ఉన్న అందరిలోకీ మోస్ట్ హ్యాండ్సమ్ మ్యాన్ గా పేరు తెచ్చుకుని, హాలీవుడ్ హార్ట్ థ్రాబ్ అయిపోయాడు టేలర్ జాన్సన్. ఎన్నో కఠినమైన వ్యాయామ నియమాలు పాటించి, స్ట్రిక్ట్ డైట్ రోటీన్ తో ఆకట్టుకునే ఫిజిక్ తో పాటుగా చాలా ఎట్రాక్టివ్ గా మారాడు. అతనికి ఫిట్నెస్ మీద ఉన్న ఆసక్తి కారణంగా, మార్వెల్ క్యారక్టర్ అంత బాగా రూపొందింది.

ఈ మధ్య అతనితో జరిగిన మీడియా ఇంటరాక్షన్ లో, ఆర్ రేటెడ్ స్టోరీ కోసం, తను ఎంత కష్ట పడ్డాడో చెప్పాడు.

“క్రావెన్ రోల్ కి ఉన్న ఫిజిక్ కోసం, నేను డేవిడ్ కింగ్స్ బరీ అనే ట్రైనర్, నేట్ ష్మిత్ అనే న్యూట్రిషనిస్ట్ హెల్ప్ తీసుకున్నాను. కామిక్స్ లో చూస్తే, క్రావెన్ చాలా పెద్ద వాడిలా కనిపిస్తాడు. అందు వల్ల, ఆ పాత్రకు మజిల్స్ ఎక్కువగా పెంచాల్సి వచ్చింది. కామిక్ బుక్స్ లో చూసిన క్రావెన్ క్యారక్టర్ నే, ఆడియన్స్ అందరూ స్క్రీన్ మీద చూడాలనుకుంటారు. అలా ఉండాలి అంటే ఏం చేయాలో ఆలోచిస్తే, ఆ కాస్ట్యూమ్ కి కరెక్ట్ గా సెట్ అవ్వాలి అంటే, బాడీ ట్రాన్స్ఫార్మ్ చేయాలని డిసైడ్ అయ్యాను. కానీ, ఇదేమీ అంత సులభమైన పని కాదు. కొన్ని సంవత్సరాల పాటుగా జరిగే పనిని , మేము కేవలం ఆరు నెలలలో చేశాం!” అని చెప్పాడు టేలర్ జాన్సన్.

ఆ తర్వాత, అతని ట్రైనర్ కింగ్స్ బరీ మాట్లాడుతూ, “టేలర్ జాన్సన్ చాలా త్వరగా మజిల్ బిల్డ్ చేసుకుంటూ వచ్చారు. రోజు రోజుకీ, షూటింగ్ సమయంలో, ఒక లొకేషన్ నుంచి ఇంకొక లొకేషన్ కు, మొబైల్ జిమ్ ను ఉపయోగించే వాళ్ళం. వారానికి ఐదు సార్లు, ఆయన వెయిట్ ట్రైనింగ్ లో ఉండేవారు. అప్పుడు చాలా ఛాలెంజెస్ ను ఫేస్ చేశాం.. రోజు రోజుకీ మాకు కొంచెం టెన్షన్ ఉండేది గానీ, ఎక్కువ ట్రైనింగ్ వల్ల కూడా మజిల్ డ్యామేజ్ అవుతుంది అని, కొన్ని ప్రత్యేకమైన వర్కౌట్స్ మాత్రమే చేసే వాళ్లం.” అని చెప్పుకు వచ్చాడు.

క్రావెన్ ది హంటర్ అనేది ఒక యాక్షన్, ఆర్ రేటెడ్ సినిమా. మార్వెల్ కామిక్స్ లో వచ్చిన ఫేమస్ విలన్స్ లో, క్రావెన్ ఎలా ఉన్నాడో ఈ కథలో తెలుస్తుంది. ఆరోన్ టేలర్ జాన్సన్ ఈ కథలో క్రావెన్ పాత్రలో నటించారు. అతని తండ్రి నికోలన్ క్రావినోఫ్ ఒక క్రూరమైన గ్యాంగ్స్టర్ (రస్సెల్ క్రోవ్). ఆ పరిణామాల వల్ల, క్రావెన్ కూడా కొన్ని క్రూరమైన పరిణామాలతో, ప్రతీకారం తీర్చుకునే మార్గాన్ని మొదలు పెట్టాడు. అలా ప్రపంచంలోనే గొప్ప హంటర్ గా మారడమే కాకుండా, అందరూ భయపడే వ్యక్తిగా ఎలా మారాడు అన్నదే కథ.

ఈ సినిమాకి, J.C దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో, చాందోర్, అరియానా డిబోస్, ఫ్రెడ్ హెచింగర్, అలెశాండ్రో నివోలా, క్రిస్టోఫర్ అబాట్ మరియు రస్సెల్ క్రోవ్ కూడా నటించారు.

సోనీ పిక్చర్స్ ఎంటర్‌టైన్‌మెంట్ లో, ఇండియా లో జనవరి 1వ తేదీన ‘క్రావెన్ ది హంటర్’ ఇంగ్లీష్, హిందీ, తమిళం మరియు తెలుగు భాషల్లో విడుదల కానుంది.

Related Posts

Latest News Updates