గుజరాత్ లో ఎయిర్ బస్ సీ295 ట్రాన్స్ పోర్టు ఎయిర్ క్రాఫ్ట్ తయారీ కేంద్రం ఏర్పాటు కానుంది. వడోదరలో దీనిని ఏర్పాటు చేస్తున్నామని రక్షణ శాఖ కార్యదర్శి అజయ్ ప్రకటించారు. దీనికి ఈ నెల 30 న ప్రధాని మోదీ శంకు స్థాపన చేయనున్నారు. యూరప్ కాకుండా ఇతర ప్రాంతాల్లో సీ 295 విమానాలను తయారు చేయడం ఇదే తొలిసారి అని వెల్లడించారు. పాత ఏవీఆర్వో 748 విమానాల స్థానంలో ఎయిర్ బస్ కు చెందిన సీ 295 విమానాలను ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. ఇందుకోసం ఎయిర్ బస్ తో 21 వేల కోట్లకు ఒప్పందం కూడా కుదిరింది.
