నారా లోకేశ్ తో భేటీ అయిన తారకరత్న.. టిక్కెట్ గురించే చర్చలు?

టీడీపీ యువనేత, మాజీ మంత్రి నారా లోకేశ్ తో నటుడు నందమూరి తారకరత్న భేటీ అయ్యారు. ఈ భేటీలో ప్రస్తుత రాజకీయాలు, కుటుంబం గురించి చర్చించుకున్నారు. కొన్ని రోజుల క్రిందటే నందమూరి తారకరత్న కీలక ప్రకటన చేశారు. రానున్న ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని కీలక ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో వీరిద్దరి భేటీ ప్రాధాన్యత ఏర్పడింది. వీరిద్దరి భేటీ మర్యాదపూర్వకంగానే అని ప్రకటిస్తున్నా…. ఎన్నికల్లో సీటు గురించే వీరిద్దరి మధ్యా చర్చ జరిగినట్లు తెలుస్తోంది.

టీడీపీ ప్రస్తుతం ఏపీలో గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. ప్రస్తుతం తారకరత్న స్క్రీన్ పై పెద్దగా కనిపించకపోయినా…. నందమూరి కుటుంబ నేపథ్యం ఆయనకు బాగా కలిసొస్తుంది. ఎన్నికల నాటికి చంద్రబాబు నందమూరి కుటుంబం నుంచి మరొకర్ని టీడీపీలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే తారకరత్న టీడీపీలో యాక్టివ్ అయ్యేందుకు ప్రయత్నాలు ప్రారంభించినట్లు వార్తలొస్తున్నాయి.

Related Posts

Latest News Updates