ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) సరికొత్త రికార్డు నెలకొల్పింది. వచ్చే యేడాది జరగనున్న తానా 23 వ మహాసభల నిర్వహణ కోసం 48 కోట్ల విరాళాలను సేకరించింది. విరాళాల సేకరణలో ఇది ఓ రికార్డ్. వచ్చే యేడాది జూలై 7 నుంచి 9 వరకూ అంటే మూడు రోజుల పాటు ఫిలడెల్ఫియా నగరం వేదికగా తానా మహా సభలు జరగనున్నాయి. దాదాపు 4 సంవత్సరాల తర్వాత ఈ సభలు జరుగుతున్నాయి. తానా అధ్యక్షుడు అంజయ్య చౌదరి లావు, కన్వీనర్ పొట్లూరి రవి ఆధ్వర్యంలో నిర్వహించిన విరాళాల సేకరణ లో దాదాపు 800 మంది పాల్గొన్నారు. విరాళాలు అందించిన ప్రతిఒక్కరినీ తానా అధ్యక్షుడు అంజయ్య చౌదరి పేరుపేరునా ధన్యవాదాలు ప్రకటించారు. అభినందించారు.
అయితే తానా ఇప్పటి వరకు 22 సార్లు మహా సభలు నిర్వహించింది. గత సంవత్సరం కూడా మహా సభలు నిర్వహించాల్సి ఉండగా, కరోన ప్రభావంతో మహాసభలు వాయిదా పడ్డాయి.ఈ క్రమంలోనే ఈ సారి అంటే . తానా మహా సభలను భారీ స్థాయిలో నిర్వహించడానికి ముందస్తుగా సన్నాహక కార్యక్రమాలు చేపట్టారు. తానా అధ్యక్షుడు అంజయ్య చౌదరి మాట్లాడుతూ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియచేశారు.ఇతర కమిటి సభ్యులను, వాలంటీర్లను, దాతలను పరిచయం చేస్తూ వారు చేసిన సేవల గురించి తెలియజేశారు.