ఖమ్మంలో TANA తరపున మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ జరిగింది. సామినేని ఫౌండేషన్ చైర్మన్ సామినేని రవి 33 కుట్టు మిషన్లను సమకూర్చగా… మంత్రి పువ్వాడ అజయ్ చేతుల మీదుగా మిషన్ల పంపిణీ జరిగింది. అంతేకాకుండా వృద్దులకు దుప్పట్లను కూడా పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా తానా ఫౌండేషన్ చైర్మన్ యర్లగడ్డ వెంకట రమణ పాల్గొనగా, స్థానిక కార్పొరేటర్ కర్నాటి క్రిష్ణ అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ విజయ్, కార్పొరేటర్స్ మాడురి ప్రసాద్, ఆళ్ల నిరిషా రెడ్డి, దాదే అమృతమ్మ, శ్రీలక్ష్మి, స్ధానిక సమన్వయకర్త బండి నాగేశ్వరరావు, నాయకులు మెహబూబ్ అలీ, అన్నం శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.