బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రికి ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) కోటి రూపాయల విరాఠం ప్రకటించింది. తానా మహాసభల్లో భాగంగా సేకరించే కోటి రూపాయలను బసవతారకం ఆస్పత్రికి విరాళంగా ఇస్తున్నామని తానా అధ్యక్షుడు లావు అంజయ్య చౌదరి ప్రకటించారు. మరోవైపు ఫిలడెల్ఫియాలో 2023 న జరిగే తానా సభల లోగోను సినీనటుడు మురళీ మోహన్ ఆవిష్కరించారు. తనకు తానా అంటే చాలా ఇష్టమని తెలిపారు.
ఇక… తానా అధ్యక్షుడు అంజయ్య చౌదరి మాట్లాడుతూ.. మహాసభలకు వ్యాపారవేత్తలను, సినీ ప్రముఖులు, సాహితీ వేత్తలు, అభిమానులు అందరూ రావాలని ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మహాసభల సమన్వయ కర్త రవి పొట్లూరి, ప్రతాప్ రెడ్డి, లక్ష్మీ దేవినేని, శశికాంత్ వల్లేపల్లి పాల్గొన్నారు. ఇక… తానా మహా సభల కన్వీనర్ రవి పొట్లూరి మహా సభలకు సంబంధించిన విశేషాలను ప్రకటించారు. అందరూ హాజరై, విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.