ఆన్ లైన్ గేమింగ్ ను నిషేధిస్తూ తమిళనాడు సర్కార్ ఆర్డినెన్స్.. కేబినెట్ ఆమోదం

ప్రస్తుతం విద్యార్థులందరూ ఆన్ లైన్ గేమింగ్ పైనే దృష్టి. దీంతో వారిపై మానసికంగా తీవ్ర ప్రభావం పడుతోందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం కూడా తెలిసిందే. అంతేకాకుండా తల్లిదండ్రులు కూడా తీవ్రంగా మధనపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆన్ లైన్ గేమింగ్ లను నిషేధించేందుకు రెడీ అవుతున్నాయి. స్టాలిన్ సారథ్యంలోని తమిళనాడు ప్రభుత్వం తాజాగా ఆన్ లైన్ గేమింగ్ ను నిషేధిస్తూ… రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.

 

ఆ రాష్ట్ర గవర్నర్ ఆమోదం లభించగానే… రాష్ట్రంలో ఆ ఆర్డినెన్స్ అమలులోకి రానుంది. రమ్మీ, పోకర్ వంటి ఆన్ లైన్ ఆటలను నిషేధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆన్ లైన్ గేమ్ వల్ల యువత నష్టపోతోందని, దీనిపై కఠిన చర్యలకు దిగుతున్నామని కోర్టులో స్టాలిన్ ప్రభుత్వం వాదించింది. ఇక.. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు, కేరళ, కర్నాటక రాష్ట్రాలు కూడా ఈ ఆన్ లైన్ గేమింగ్ ను నిషేధించాలని కోరుతున్నాయి.

Related Posts

Latest News Updates